English | Telugu

సుశాంత్‌తో ఎఫైర్‌.. ఎట్టకేలకు స్పందించిన మీనాక్షి చౌదరి!

- వాటి గురించి పట్టించుకోనంటున్న మీనాక్షి

- ఐదేళ్లుగా వినిపిస్తున్న రూమర్‌పై క్లారిటీ

- వస్తున్న రూమర్స్‌పై సుశాంత్‌ ఏమన్నాడంటే..?

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్‌ అనేవి సర్వసాధారణం. ఒక హీరో, ఒక హీరోయిన్‌ కలిసి వరసగా సినిమాలు చేస్తున్నారంటే వారి మధ్య ఏదో ఉంది అనే ప్రచారం మొదలవుతుంది. అలా వచ్చిన రూమర్స్‌ కొన్నిసార్లు రూమర్స్‌గానే మిగిలిపోతాయి. మరికొన్ని సందర్భాల్లో ఆ రూమర్స్‌ని నిజం చేస్తూ ఆ జంట పెళ్లి చేసుకోవడం మనం చూశాం. అలాంటి ఓ రూమర్‌ గత ఐదేళ్లుగా హీరో సుశాంత్‌, హీరోయిన్‌ మీనాక్షిచౌదరిల గురించి వినిపిస్తోంది. ఈ రూమర్‌ గురించి మీనాక్షి ఒక క్లారిటీ ఇచ్చింది.

2021లో సుశాంత్‌ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది మీనాక్షి. ఈ సినిమా తర్వాత తెలుగులో వరస అవకాశాలు అందిపుచ్చుకుంటూ హీరోయిన్‌గా ఎదుగుతోంది. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం చిత్రంలో నటించిన మీనాక్షి.. ఈ ఏడాది వెంకటేష్‌ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి మరో సినిమాతో వస్తోంది. నవీన్‌ పొలిశెట్టి హీరోగా రూపొందిన అనగనగా ఒకరాజు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు, సుశాంత్‌కి మధ్య ఉన్న రిలేషన్‌ గురించి క్లారిటీ ఇచ్చింది. గత ఐదేళ్లుగా సుశాంత్‌, మీనాక్షి మధ్య ఏదో ఉంది అంటూ వస్తున్న వార్తల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘తెలుగులో నా మొదటి సినిమా హీరో సుశాంత్‌. ఆ సినిమా చేస్తున్నప్పుడే అతనితో స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి మేం మంచి ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. అయితే మా గురించి మీడియాలో, సోషల్‌ మీడియాలో రకరకాల రూమర్లు వస్తున్నాయి. ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం అనే విషయం అందరికీ తెలిసిందే. వాటిని చూసీచూడనట్టు వదిలెయ్యాలి. లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఈ విషయం సుశాంత్‌తో చెప్పాను. వాటి గురించి ఆలోచించి మన టైమ్‌ వేస్ట్‌ చేసుకోకూడదు అంటూ తన ఒపీనియన్‌ చెప్పాడు’ అంటూ వారి మధ్య రిలేషన్‌ గురించి క్లారిటీ ఇచ్చింది మీనాక్షి. ఐదేళ్లుగా మీడియాలో వస్తున్న వార్తలకు మీనాక్షి ఇచ్చిన సమాధానంతో చెక్‌ పెట్టినట్టయింది. ఇప్పుడీ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.