Read more!

English | Telugu

రవితేజ దర్శకత్వంలో విశ్వక్ సేన్!

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ మార్చి 22న 'దాస్ కా ధమ్కీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. ఈ చిత్రానికి విశ్వక్ సేనే దర్శకుడు కావడం విశేషం. ఇదిలా ఉంటే హీరోగా తన పదో సినిమాని తాజాగా ప్రకటించాడు విశ్వక్. ఈ మూవీతో రవితేజ ముళ్ళపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం నాడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జేక్స్‌ బెజాయ్‌, సినిమాటోగ్రాఫర్ గా మనోజ్, ఎడిటర్ గా అన్వర్ వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.