English | Telugu
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత!
Updated : Dec 30, 2025
మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohanlal) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 90 సంవత్సరాలు.
శాంతకుమారి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మమ్ముట్టి దంపతులు మోహన్ లాల్ నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం తెలుపుతున్నారు. అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: మెగా విక్టరీ మాస్ సాంగ్.. సంక్రాంతి వైబ్ ముందే వచ్చేసింది!
శాంతకుమారి, విశ్వనాథన్ నాయర్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మోహన్‌లాల్. మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన విశ్వనాథన్ కొన్నేళ్ల క్రితమే మరణించారు. మోహన్‌లాల్ సోదరుడు కూడా 2000లో గుండెపోటుతో మృతిచెందారు.