English | Telugu

విశ్వక్ సేన్ లో ఈ మార్పుకి కారణం ఏంటి?

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తు వరుస విజయాలని తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న హీరో విశ్వక్ సేన్. తన సినీ కెరియర్ బిగినింగ్ నుంచి విభిన్న చిత్రాల్లో నటిస్తూ ఇప్పుడున్న యువ కథానాయకుల్లో విశ్వక్ సేన్ ఒక వెరైటీ కథానాయకుడు అనే పేరుని ప్రేక్షకుల్లో సంపాదించాడు. కానీ అప్పుడప్పుడు తన సినిమా రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా మితిమీరి ప్రాంక్ వీడియోస్ చేస్తాడనే పేరుని కూడా బాగానే సంపాదించాడు. తాజాగా విశ్వక్ సేన్ నయా గెటప్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ప్రస్తుతం విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ విడుదలకి సిద్ధంగా ఉంది. చిత్ర బృందం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసింది. అయితే విశ్వక్ సేన్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం సంస్థ అయిన ఆహ ఛానల్ లో ధమాకా అనే ఒక ప్రోగ్రాం ని కూడా చేస్తున్నాడు .ఆ ప్రోగ్రాం యొక్క ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే నిర్వాహకులు ఒక ఫంక్షన్ ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్ సేన్ ఆంజనేయస్వామి మాల వేసుకొని కనిపించాడు. పైగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఆంజనేయస్వామి మాలలో ఉన్న తన ఫోటోని పోస్ట్ చేసి జై భజరంగబళి అనే పదాన్ని కూడా క్యాప్షన్ గా రాసాడు. మాస్ హీరోగా పేరు తెచ్చుకొని, అప్పుడప్పుడు వివాదాల్లో కూడా నిలిచే విశ్వక్ సేన్ హఠాత్తుగా అలా కనపడటంతో ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది అయితే విశ్వక్ సేన్ లో సడన్ గా భక్తి భావం ఏర్పడటానికి కారణం ఏమయ్యివుంటుందని చర్చించుకుంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.