English | Telugu

సమంత 'శాకుంతలం'కి ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదు!

ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన సినిమాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. 'దాస్ కా ధమ్కీ' వాయిదా పడినట్లు ప్రకటన వచ్చిన కాసేపటికే.. 'శాకుంతలం' కూడా వాయిదా అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17 బాక్సాఫీస్ బరిలో 'సార్', 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాలు మాత్రమే నిలవనున్నాయి.

సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'శాకుంతలం'. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలము ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో కలిసి గుణ టీమ్‌ వర్క్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. కొన్ని వాయిదాల తర్వాత గతేడాది నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ 3Dలో విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఆలస్యంగా వస్తున్నామని చివరి నిమిషంలో ప్రకటించారు. ఇక ఇటీవల ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ ఆ తేదీకి కూడా రావడం అనుమానమే అని కొద్దిరోజులుగా వారాలొస్తున్నాయి. ఊహించినట్లుగానే ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. మరి ఈ సినిమా విడుదలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.