English | Telugu
మాకు క్లారీటి వచ్చిందంటున్న విష్ణు
Updated : Jan 30, 2014
ప్రముఖ నటుడు మోహన్ బాబు తనకు ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును సినిమా టైటిల్స్ లలో వాడుకున్నారని వివాదాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వంటి ప్రధాన తారగణమంతా కలిసి నటించిన "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా నటుడు విష్ణు మాట్లాడుతూ..." పద్మశ్రీ విషయంలో ఎందుకు వివాదం రేగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఈ పురస్కారం అందుకున్న ఎంతో మంది సినిమా టైటిల్స్ లో వాడుకున్నారు. మోహన్ బాబు గారి విషయంలో దీన్నో పెద్ద విషయం చేస్తున్నారు. పద్మశ్రీ పురస్కారం విషయంలో ఉన్న నియమ నిబంధనల విషయంలో మాకో స్పష్టత వచ్చింది. పేరుకి ముందుగానీ, వెనుకగానీ పద్మశ్రీ అని రాసుకోకూడదు. పేరు తర్వాత "రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వ్యక్తి" అనే అర్థం వచ్చేలా రాసుకోవచ్చు. దీనిని మేము "పాండవులు పాండవులు తుమ్మెదా" సినిమాలో ఆచరించాం. ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోతుందని అనుకుంటున్నాం" అని అన్నారు.