English | Telugu
కీరవాణి నిర్ణయం అప్పటిదే...!
Updated : Jan 31, 2014
తన పాటలు వింటే ఎదో ఆనందం, ఎంతో ఆహ్లాదం... అది ఏ వయస్సు వారినైనా తన పాటలతో, తన సంగీతంతో కట్టిపడేయగల సత్తా అతనిది. క్లాస్, మాస్, స్టైల్, రాక్, లవ్.. ఇలా అన్ని రకాల పాటలతో ఇప్పటికి టాప్ 5 స్థానంలో ఉన్నారు ఆయన. ఆయన మరెవరో కాదు.. స్వరవాణి ఎం.ఎం.కీరవాణి. "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...." ఈ పాట ఎప్పటికి సూపర్ హిట్. ఇలాంటి కొన్ని వందల పాటలకు, వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించిన కీరవాణి మరో రెండు సంవత్సరాల తరువాత రిటైర్మెంట్ అవ్వబోతున్నాడు అంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఈ రిటైర్మెంట్ నిర్ణయం ఇప్పటిది కాదు. తనకు సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చిన మొదటి సినిమా రోజే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ భవిష్యత్తు గురించి ఇప్పుడెందుకులే అని అందరూ మర్చిపోయారు. కానీ కీరవాణి మాత్రం తను తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేసుకుంటూ ఇటీవలే తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేసాడు. దానిలో 2016 డిసెంబర్ 8న రిటైర్ కాబోతున్నాను అనేది ఆ ప్రకటన సారాంశం. కానీ ఆ రోజున..తన తొలిపాట రికార్డ్ అయిన ప్రసాద్ స్టూడియోలోనే రిటైర్మెంట్ డే ని, పలువురు సంగీత దర్శకులు, తనకు బాగా దగ్గరైన అసోసియేట్స్ తో జరుపుకోవాలని, ఇన్నేళ్ళుగా తమ ఇష్టాయిష్టాలను, సలహాలను, సూచనలను ఇచ్చిన నా అభిమానులకు ధన్యవాదాలు" అని ఫేస్ బుక్ ద్వారా ఆయన తెలియజేసారు.