English | Telugu

మగమహారాజు సినిమా రివ్యూ

రాజకీయ సభలకు మనుషుల్ని సప్లై చేసే కంపెనీ నడిపే శరవణ (విశాల్‌) మాయ (హన్సిక)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. ఐతే చిన్న అపార్థం వల్ల ఆమెకు దూరమై మందుకొట్టి ఇంటికొచ్చిన శరవణను తల్లి చెడామడా తిడుతుంది. నీ తండ్రికి దూరంగా ఉండి నిన్ను కష్టపడి పెంచితే ఇలా చేస్తావా అంటుంది. అప్పుడిక తండ్రిని వెతుక్కుంటూ బయల్దేరతాడు శరవణ. తండ్రిని కలిశాక తనకు ఇంకో ఇద్దరు తమ్ముళ్లున్నారని తెలుస్తుంది. తండ్రిని అపార్థం చేసుకుని ఆయన్ని ఇంటినుంచి వెళ్లగొట్టిన ముగ్గురు అత్తయ్యల దగ్గరికెళ్లి.. వాళ్ల మనసు మార్చి హీరో ఎలా కుటుంబం మొత్తాన్ని ఒక్కటి చేశాడన్నది మిగతా కథ.

ఈ కథ వింటుంటే గత కొన్నేళ్లలో వచ్చిన చాలా తెలుగు సినిమాలు గుర్తుకొస్తున్నాయి కదా. ఇలాంటి సినిమాలు తెలుగులోనే కాదు.. తమిళంలోనూ తీస్తారండోయ్. సినిమాలో ఏ కోశాన కూడా కొత్తదనం అన్నదే కనిపించకుండా ఖుష్బూ శ్రీవారు సుందర్.సి చాలా జాగ్రత్తగా ఎన్నో పాత సినిమాల్ని కలిపి వండిన సినిమానే ‘మగమహారాజు’.ఈ సినిమా అంతా పరమ రొటీన్‌గా 90ల్లో సినిమాలా సాగిపోతుంది. దీనిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గదరి సంతానం కామెడీ మాత్రమే. అతడి ఇంట్రడక్షన్ సీన్ మొదలుకుని.. అరగంటకు పైగా నాన్ స్టాప్‌గా సాగే అతడి కామెడీ.. టికెట్ డబ్బులకు సరిపడా వినోదాన్నిస్తుంది. ఐతే అతను తెర మీది నుంచి మాయమావగానే ప్రేక్షకులకు పరీక్ష మొదలవుతుంది.సంతానం ఎపిసోడ్ అయిపోయాక.. మళ్లీ చివర్లో 20 నిమిషాల ముందు అతను వచ్చే వరకు సినిమాను భరించడం చాలా కష్టం. అంతా పరమ రొటీన్‌ సినిమాలా సాగిపోతుంది.

హీరో తన తండ్రిని కలిశాక అత్తయ్యల్ని మార్చడానికి బయల్దేరిన దగ్గర్నుంచి.. తర్వాత ఏం జరగబోయేది క్లియర్‌గా తెలిసిపోతుంది. హన్సిక గ్లామర్ మాత్రమే గంటకు పైగా సాగే ఈ కథనంలో కాస్త రిలీఫ్. హన్సిక అందాలు బాగానే ఆరబోసింది. హీరో తమ్ముళ్లుగా వైభవ్‌, సతీష్‌ పర్వాలేదు. రమ్యకృష్ణ, ప్రభు ఓకే. హిప్‌హాప్‌ తమిళ అనే కొత్త సంగీత దర్శకుడు అందించిన పాటల్లో చెప్పుకోదగ్గవి ఏవీ లేవు. వాయిద్యాల మోత విసిగిస్తుంది. గోపీ అమర్‌నాథ్‌ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.విశాల్ బాగానే ఖర్చుపెట్టాడు. కామెడీ విషయంలో సుందర్ తన అనుభవం చూపించినా.. మిగతా విషయాల్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాడు. మాస్‌ను మెప్పించే అంశాలుండటం వల్ల.. సంతానం కామెడీ, హన్సిక గ్లామర్ వల్ల బి,సి సెంటర్లలో ఈ సినిమా కొంతవరకు ప్రభావం చూపించొచ్చు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .