English | Telugu
స్టార్ హీరో కుక్కలపై కేసు నమోదు!
Updated : Nov 1, 2023
కొంతమంది సినీ ప్రముఖులకు వివాదాలు కొత్త కాదు. ఏదో ఒక విషయంలో వివాదాలు రావడమో లేక వివాదాస్ప వ్యాఖ్యలు చేయడమో మనం చూస్తుంటాం. తద్వారా వారిపై కేసులు కూడా నమోదు కావడం జరుగుతూ ఉంటుంది. ఇటీవల కన్నడ స్టార్ హీరో దర్శన్‌పై పోలీస్ కేసు నమోదైంది. అమితా జిందాల్ అనే మహిళ దర్శన్‌పై ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే.. అమితా జిందాల్ ఇటీవల హీరో దర్శన్ ఇంటి పక్కనే ఉన్న తన బంధువుల ఇంటికి ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లింది. దర్శన్ ఇంటి సమీపంలోని ఖాళి ప్రదేశంలో తన కారును పార్క్ చేసింది. తిరిగి తన దగ్గరకు వచ్చేసరికి అక్కడ రెండు కుక్కలు ఉండడాన్ని గమనించింది. అవి హీరో దర్శన్ కుక్కలు. వాటి కేర్ టేకర్ కూడా అక్కడే ఉన్నారు. పార్కింగ్ ప్రదేశంలో ఇలా కుక్కలను వదిలితే ఎలా అని కేర్ టేకర్‌తో అంటుండగా, ఇంతలో ఒక కుక్క తనపై దాడి చేసిందని, ఆ తర్వాత రెండో కుక్క కూడా దాడికి దిగి తనను గాయపరిచిందని ఫిర్యాదులో పేర్కొంది. కేర్ టేకర్‌ని మొదటి నిందితుడిగా, హీరో దర్శన్‌ని రెండవ నిందితుడిగా కేసు నమోదు చేశారు. హీరో దర్శన్‌పై పోలీస్ కేసు నమోదు కావడం కొత్తేమీ కాదు. పలు వివాదాల్లో దర్శన్‌పై కేసులు నమోదయ్యాయి. కాంట్రవర్సియల్ ఆడియో క్లిప్ వల్ల దర్శన్ గతంలో రెండేళ్ళపాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. తాజాగా నమోదైన కేసు విషయంలో దర్శన్ మాత్రం స్పందించలేదు.