English | Telugu
విక్రమ్ పడిన కష్టం
Updated : Jan 21, 2015
'ఐ’ సినిమాకు ఎలాంటి టాక్ ఉన్నప్పటికీ.. ఈ సినిమా కోసం విక్రమ్ పడ్డ కష్టం, అతడి నటన మాత్రం అద్భుతమని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇండియాలో మరే నటుడు కూడా సినిమా కోసం ఇంత కష్టపడి ఉండడని సినిమా చూసిన వారందరూ ఒప్పుకుంటున్నారు. ఈ కష్టం గురించి విక్రమ్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘‘సాధారణంగా బాడీ బిల్డింగ్ కోసం ఏడాది పడుతుంది. నేను ఐదు నెలల్లోనే చేశాను. స్లిమ్ లుక్ కోసం చాలా కసరత్తులు చేశాను. గూనివాడి పాత్రను మేకప్‌తో సరిపెట్టేద్దాం అని శంకర్ అన్నారు. కానీ నేను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. చివరికి నా బరువు 56 కిలోలకు చేరుకుంది. నా టార్గెట్ 50 కిలోలు. ఇంకో ఆరు కిలోలు తగ్గాలనుకున్నాను. ఐతే డాక్టర్ వద్దన్నారు. ‘శరీరం అనేది ఓ అద్భుతం. ఆ అద్భుతాన్ని పదిలంగా కాపాడుకోవాలి. ఇంతకన్నా బరువు తగ్గితే అవయవాలు ఫెయిలయ్యే ప్రమాదముంది’’ అన్నారు. దీంతో అక్కడితో ఆపేసాను. దాదాపు 8 నెలలు సరిగా తిండి తినలేదు’’ అని విక్రమ్ చెప్పాడు.