English | Telugu
టెంపర్ రిలీజ్ పై సందేహాలు
Updated : Jan 21, 2015
టెంపర్ రిలీజ్ విషయంలో ఇప్పటికి ఎన్ని డేట్లు మారాయో లెక్క లేదు. ఐతే ఇప్పుడు కొత్త డేటొచ్చింది. ఇదే ఫైనల్ అంటున్నారు. ఫిబ్రవరి 12న టెంపర్ రిలీజ్ చేయబోతున్నారట. ముందుగా అనుకున్నట్లు ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేయడానికి కుదరకపోవచ్చని.. అందుకే 12కు వాయిదా వేశారని అంటున్నారు. అంతే కాదు.. జనవరి 26న ఆడియో విడుదలకు ముహూర్తం ఖాయం చేశారట. మరి ఈ తేదీలైనా ఖాయమా లేదా అని అభిమానుల్లో సందేహాలు లేకపోలేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఖాయమనుకున్న తేదీల్ని మార్చేశారు. కాబట్టి స్వయంగా నిర్మాత బండ్ల గణేషో, దర్శకుడు పూరి జగన్నాథో ఈ వార్తను కన్ఫమ్ చేయాల్సింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 12న సినిమాను రిలీజ్ చేయడం కరెక్టేనా అని కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తర్వాతి రోజే వన్డే ప్రపంచకప్ మొదలవుతోంది. రెండో రోజే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. కాబట్టి ఫిబ్రవరి 5నే సినిమాను విడుదల చేసి ఉంటే బావుంటుందన్నది వారి అభిప్రాయం. అసలే ఫిబ్రవరిలో విద్యార్థులు సినిమాలకు రావడం తక్కువ. పైగా ఇలాంటి ఇబ్బందులుంటే సినిమా వసూళ్లపై ప్రభావం పడొచ్చన్నది వారి ఆందోళన.