English | Telugu
గబ్బర్ సింగ్‌ని కాపీ కొట్టారా??
Updated : Jan 21, 2015
కొన్నేళ్లుగా హిట్ కోసం తహతహలాడుతున్నాడు నందమూరి హీరో కల్యాణ్‌రామ్. భారీగా ఖర్చు పెట్టి తీసిన ఓం త్రీడీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈసారి ప్రయోగాల జోలికి పోకుండా ఓ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీ చేశాడు. అదే.. పటాస్. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ ఓ నకీలి, లంచగొండీ పోలీస్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాకీ పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకీ దగ్గర పోలికలున్నాయని టాక్. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ సినిమాని చూసిన కొంతమంది ''అచ్చం గబ్బర్ సింగ్‌లా ఉంది కదా..'' అనే సందేహం వ్యక్తం చేశారు. కథ వేరే అయినా కల్యాణ్‌రామ్ క్యారెక్టరైజేషన్‌పై మాత్రం గబ్బర్ సింగ్ ప్రభావం భారీగా పడిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు. ''గబ్బర్ సింగ్‌కీ ఈ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. ఆ కథ, ఈ కథ రెండూ వేర్వేరు'' అంటున్నాడు. ఇంకెంత..?? రెండ్రోజుల్లో పటాస్ బొమ్మ తెరపై పడిపోతుంది. అప్పుడు ఏది అసలో, ఏది కాపీనో తెలిసిపోతుంది.