English | Telugu

ఓజి స్క్రీన్ పై మేకులు,ఇనప కంచె.. మీరు మామూలోళ్లు కాదు  

రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఓజి'(OG)ఫీవర్ మొదలైంది. సెప్టెంబర్ 25 ముందు రోజు మిడ్ నైట్ బెనిఫిట్ షో ప్రదర్శిస్తుండటంతో, టికెట్స్ కోసం అభిమానులు తమ తమ మార్గాల్లో ట్రై చేస్తున్నారు. బెనిఫిట్ షో మొదలుకొని రిలీజ్ రోజు పవన్ ఫ్యాన్స్ థియేటర్స్ లో చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. సీట్ల పై నుంచొని ఎగరడమే కాకుండా,స్క్రీన్ ముందుకు వెళ్లి పవన్(Pawan Kalyan) జెండాలు పట్టుకొని డాన్స్ లు చెయ్యడం, అక్కడే బాణాసంచాలు కాల్చడం లాంటివి చేస్తుంటారు.

ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెడుతు 'విజయవాడ'(Vijayawada)లోని గాంధీనగర్ ఏరియాలో ఉన్న 'శైలజ థియేటర్'(sailaja Theater)ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్క్రీన్ పైకి అభిమానులు రాకుండా, స్క్రీన్ పై మేకులతో పాటు ఇనుప కంచెని ఏర్పాటు చేసారు. సీట్స్ కింద పెద్ద పెద్ద బండ రాళ్ళని కూడా ఉంచడం జరిగింది. ఈ ఏర్పాట్లపై థియేటర్ యాజమాన్యం మాట్లాడుతు పవన్ ఫ్యాన్స్ ఉత్సాహంతో స్క్రీన్ పైకి వెళ్లి జెండాలతో ఎగరడం వలన, వాటికి ఉన్న కర్రలు గుచ్చుకొని స్క్రీన్స్ డామేజ్ అవుతున్నాయి. కొంత మంది కావాలనే స్క్రీన్ ని చించుతున్నారు. దీంతో నెక్స్ట్ షో ప్రేక్షకులకి ఇబ్బంది కలగడమే కాకుండా, మేము కూడా నష్టపోతున్నాం. ఇనుప కంచె, మేకులు ఏర్పాటు చేయడం వల్ల, స్క్రీన్ పైకి ఎవరు వెళ్లకుండా, కిందే ఎగురుతారు. బౌన్సర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం.

కుర్చీల్లో ఎగరడం వల్ల కుర్చీలు విరిగిపోతున్నాయి. దీంతో నెక్స్ట్ షో ప్రేక్షకులు మూడుగంటల పాటు సినిమా చూడలేరు. గతంలో ఇలాగే ఒక సినిమాకి చెయ్యడం వలన, 150 కుర్చీలు విరిగిపోయాయి. దీంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చెయ్యడంతో టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేశాం. ఇప్పుడు కుర్చీ కింద పెద్ద పెద్ద బండ రాళ్లు ఏర్పాటు చేయడం వల్ల, ఎంత ఎగిరినా కుర్చీలు డామేజ్ అవ్వవని యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారడంతో పాటు, అభిమానులని కంట్రోల్ చేయడానికి శైలజ థియేటర్ ఫాలో అయినట్టుగానే ఇతర థియేటర్స్ వాళ్ళు ఫాలో అవుతారేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .