English | Telugu
వెండితెరపై మళ్లీ విజయశాంతి
Updated : Jan 21, 2015
ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా చలామణీ అయిన విజయశాంతి.. ఆ తరవాత మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది. రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మళ్లీ ఆమె మేకప్ వేసుకోబోతోందని సమాచారమ్. బి.గోపాల్-గోపీచంద్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార కథానాయిక. ఈ చిత్రంలో విజయశాంతి ఓ కీలకమైన పాత్ర పోషించబోతున్నట్టు టాక్. నిజానికి సినిమాలంటే అంతగా ఆసక్తి చూపించని విజయశాంతి.. బి.గోపాల్ కోరిక మేరకే ఇందులో నటించడానికి ఒప్పుకొందని తెలుస్తోంది. ఎప్పుడో సాహసం సినిమాకంటే మొదలైన సినిమా ఇది. ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కుతోంది. విజయశాంతి రాకతో ఈ సినిమాలో స్పెషలాఫ్ ఎట్రాక్షన్ చేరినట్టే.