English | Telugu
నాగ్‌కి లొంగిపోయిన అనసూయ
Updated : Jan 21, 2015
బుల్లి తెర సంచలనం అనసూయ. యాంకరింగ్ ఎలాగున్నా... తనహాట్ లుక్స్‌తో, అదిరిపోయే డ్రస్సింగ్ సెన్స్ తో కుర్రకారుని టీవీలకు అతుక్కొనేలా చేసిందీ భామ. అనసూయ క్రేజ్‌ని చూసి చాలామంది నిర్మాతలు ఆమె వెంట పడ్డారు. మా సినిమాలో నటిస్తావా..?? అంటూ ఆఫర్లు గుమ్మరించారు. కానీ.. వాటన్నింటికి సింపుల్‌గా నో చెప్పింది. ఆఖరికి అత్తారింటికి దారేదిలో ఐటెమ్ పాటకు అడిగినా కాదంది. ఇప్పుడు మాత్రం నాగార్జునకి లొంగిపోయింది. నాగ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం సోగ్గాడే చిన్నినాయిన. ఇందులో అనసూయ ఓ కీ రోల్ చేస్తోందట. అంతేకాదు.. ఓ పాటలో నాగ్‌తో కలసి స్టెప్పులు కూడా వేయబోతోందట. మా టీవీలో కొన్ని షోలను నడుపుతోంది అనసూయ. మా టీవీ మొత్తం నాగ్ చేతుల్లో ఉంది. అందుకే నాగ్ సినిమా అనేసరికి కాదనలేకపోయిందట. మొత్తానికి అనసూయని త్వరలోనే ఓ హాట్ పాటలో చూసేయొచ్చన్నమాట. కుర్రాళ్లూ గెట్ రెడీ.