English | Telugu

ఆ హీరోయిన్‌తో నాని మ‌రోసారి!

వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు నెక్ట్స్ మూవీని వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యింద‌ని సినీ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అది కూడా త‌న ఫ్లాప్ మూవీలో న‌టించిన హీరోయిన్‌తోనే నాని మ‌రోసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌బోతున్నారంటున్నాయి మీడియా వ‌ర్గాలు. నాని నెక్ట్స్ మూవీ హీరోయిన్‌పై ఇంట్రెస్టింగ్ విష‌య‌మేమంటే...

నేచుర‌ల్ స్టార్ నాని రానున్న డిసెంబ‌ర్ 7న హాయ్ నాన్న చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నేచుర‌ల్ స్టార్ ఏకంగా తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ మూవీ త‌ర్వాత నాని త‌దుప‌రి చిత్రాన్ని వివేక్ ఆత్రేయ‌తో చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. నవంబ‌ర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ఉంటుంద‌ని స‌మాచారం. అయితే హాయ్ నాన్న సినిమా రిలీజ్ స‌మ‌యంలో కాస్త గ్యాప్ తీసుకుంటారు. ఆ లోపు కాస్త షూటింగ్ మాత్ర‌మే కంప్లీట్ అవుతుంది.

హాయ్ నాన్న రిలీజ్ తర్వాత వివేక్ మూవీపై నాని ఫుల్ ఫోక‌స్ పెట్టేస్తారు. వీరిద్ద‌రూ క‌లిసి ఇంత‌కు ముందు అంటే సుంద‌రానికీ వంటి కామెడీ మూవీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి ఓ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహ‌న్ న‌టించ‌నుంది. ప్రియాంకతో నాని ఇది వ‌రకే నానీస్ గ్యాంగ్ లీడ‌ర్ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేదు. అయిన‌ప్ప‌టికీ నాని మ‌రోసారి ప్రియాంక‌తో వ‌ర్క్ చేయ‌బోతున్నారు. మ‌రి ఈసారైనా వీరి జోడీ వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి మ‌రి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.