English | Telugu
తెలుగులో విజయ్ "అన్న"
Updated : Jul 31, 2013
తమిళ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "తలైవా". తలైవా అంటే అన్న అని అర్థం. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో "అన్న" పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు.
3k ఎంటర్ టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 9న భారీ ఎత్తున , మొత్తం భారతదేశంలోని 2500 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సత్యరాజ్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నారు.