English | Telugu
ఒక్కడితో సోఫి చిందులు...
Updated : Jul 31, 2013
మహేష్ నటిస్తున్న తాజా చిత్రం "1-నేనొక్కడినే". సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రంలోని ఓ ఐటెం సాంగ్ లో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్ సోఫి చౌదరిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. మొన్నటి వరకు శ్రీలంక సుందరి జక్వేలిన్ ఫెర్నాండెజ్ పేరు వినిపించినప్పటికి... తాజాగా ఆ స్థానంలో సోఫి చౌదరిని తీసుకున్నట్లు సమాచారం.
14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల చేయనున్నారు.