English | Telugu
సహజీవనమే ముద్దు.. పెళ్లి ఇపుడే వద్దు.
Updated : Jul 31, 2013
"ఝుమ్మందినాదం" చిత్రం తర్వాత తాప్సీ హీరోయిన్ గా నటించిన ఏ ఒక్క చిత్రం కూడా విజయం సాధించలేదు. అయితే ఇటీవలే విడుదలైన "సాహసం" చిత్రంతో కాస్త సంతోషంగా ఉంది తాప్సీ. కేవలం తన అందాల ప్రదర్శనలతోనే సినీ కెరీర్ ను నెట్టుకొస్తున్న తాప్సీ తన పెళ్లి గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
తనకు కాబోయేవాడితో రెండు, మూడేళ్ళు సహజీవనం చేశాకా... అప్పుడు నచ్చితే పెళ్లి చేసుకుంటానని లేకపోతే లేదని చెప్పేసింది. అంతే కాకుండా ఆ అబ్బాయి తన తల్లిదండ్రులకు నచ్చాలని చెప్తుంది తాప్సీ.
ఈ విషయం విన్నవాల్లందరూ కూడా... తాప్సీ మొదటగా ఎవరిని ఇష్టపడుతుందో కానీ వాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే రెండు, మూడేళ్ళు సహజీవనం పేరుతో ఎంజాయ్ చేసి.. తర్వాత తాప్సీ నచ్చలేదని వదిలేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నారు. మరి ఎక్కడున్నాడో ఈ అమ్మడికి కాబోయే ఆ బాయ్ ఫ్రెండ్.