English | Telugu

ఏనా కొడుకు మనల్ని ఆపేదేలే.. కొత్త కాంట్రవర్సీలో విజయ్!

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మాటలు ఎక్కువగా కాంట్రవర్సీ అవుతుంటాయి. తాజాగా 'కింగ్‌డమ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా విజయ్ స్పీచ్ కాంట్రవర్సీ అవుతోంది. తిరుపతిలో 'కింగ్‌డమ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంత వరకు బాగానే ఉంది కానీ.. కొన్ని కాంట్రవర్సీ అయ్యే కామెంట్స్ చేశాడు. (Kingdom Trailer)

"గత ఏడాది నుండి 'కింగ్‌డమ్' గురించి గానీ, సినిమా రిలీజ్ గురించి గానీ ఆలోచిస్తుంటే నా తలకాయలో ఒకటే తిరుగుతాంది. నా మనసులో ఒకటే గట్టిగా అనిపిస్తాంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గానీ ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. శానా పెద్దోడినై పూడుస్తాను సామి. టాప్ లో పోయి కూసుంటా." అని విజయ్ అన్నాడు. తాను టాప్ లోకి వెళ్లాలని ఆశపడటంలో తప్పులేదు కానీ.. ఆ తర్వాత విజయ్ మాట్లాడిన మాటలే వివాదాస్పదమవుతున్నాయి.

"ఆ వెంకన్న సామి దయ, మీ అందరి ఆశీస్సులు.. ఈ రెండు నాతో పాటు ఉంటే.. వానెక్క ఏనా కొడుకు మనల్ని ఆపేదేలే." అని విజయ్ అన్నాడు. తిరుపతి వెంకన్న సాక్షిగా జరిగిన ఈవెంట్ లో "వానెక్క ఏనా కొడుకు మనల్ని ఆపేదేలే." అని విజయ్ స్టేట్మెంట్ ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .