English | Telugu
బిగ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తోన్న 'కలర్ ఫొటో' డైరెక్టర్!
Updated : Aug 30, 2023
టాలీవుడ్ ట్రెండ్ మారింది. ఇప్పుడు మన స్టార్స్ వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా అగ్ర హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయటానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎన్నో భారీ మల్టీ స్టారర్ చిత్రాలు రూపొందాయి. అయితే రీసెంట్ టైమ్ లో తెలుగులో రూపొందిన భారీ చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈసినిమాలో నటించి ఇద్దరి ఫ్యాన్స్ ను అలరించారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి మరో భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించటానికి రంగం సిద్ధమవుతోంది.
సినీ సర్కిల్స్ లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. మాస్ మహారాజా రవితేజ, మంచు మనోజ్, విశ్వక్ సేన్ లతో కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు.ఇటీవల సందీప్ రాజ్ చెప్పిన కథ ముగ్గురు స్టార్స్ కు నచ్చింది. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇవ్వబోతున్నారట. అయితే ఎవరి పాత్ర ఏ మేరకు ఉంటుంది? ముగ్గురు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందా? అనేది తెలియాలంటే మూవీ ప్రకటన వరకు ఆగాల్సిందే.
'కలర్ ఫొటో' మూవీ 2020లో విడుదలైంది. తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రంగానూ అవార్డును దక్కించుకుంది. మూడేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఆయన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేయలేదు. అయితే చాలా గ్యాప్ తర్వాత సందీప్ రాజ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఏకంగా భారీ మల్టీస్టారర్ గా మెప్పించనుంది.