English | Telugu

ఎట్టకేలకు ఓపెన్ అయిన విజయ్.. తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేశాడు!

జూలై 31న 'కింగ్‌డమ్‌' మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గర్ల్ ఫ్రెండ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్. (Vijay Deverakonda)

"బంధాలు అన్నింటికంటే ముఖ్యమైనవి. ఈమధ్యనే నాకు వాటి విలువ తెలిసొచ్చింది. గత రెండు మూడేళ్లు నా లైఫ్ స్టైల్ నాకే నచ్చలేదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్.. ఇలా ఎవరికీ సమయం కేటాయించలేదు. ఈ విషయాన్ని నేను సడెన్ గా ఒకరోజు రియలైజ్ అయ్యాను. అప్పటినుంచి నా విలువైన సమయాన్ని.. నా వాళ్ళతో గడుపుతున్నాను." అని విజయ్ చెప్పుకొచ్చాడు.

విజయ్ తాజా కామెంట్స్ తో ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. విజయ్, రష్మిక పలు సందర్భాల్లో సోషల్ మీడియా పిక్స్ ద్వారా హింట్స్ ఇచ్చారు తప్ప.. వాళ్ళ రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇక ఇప్పుడు విజయ్ తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పడంతో, ఆ గర్ల్ ఫ్రెండ్ రష్మికనే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకో విశేషం ఏంటంటే ప్రస్తుతం రష్మిక 'గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా చేస్తుండటం విశేషం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.