English | Telugu

హిందీలో ‘సామ్రాజ్య’గా విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’.. జూలై 31 విడుదల!

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "కింగ్డమ్" సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ హిందీలో "సామ్రాజ్య" టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకర్స్ ఈరోజు కింగ్డమ్ మూవీ హిందీ టైటిల్ అనౌన్స్ చేశారు.‌‌ సామ్రాజ్య టైటిల్ ఇన్ స్టంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"కింగ్డమ్" చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.