Read more!

English | Telugu

అల్లు అర్జున్‌తో సినిమా తీస్తా.... చరణ్, ఎన్టీఆర్‌తో నటిస్తా!

విజయ్ ఆంటోనీ మూవీస్ ఎప్పుడూ చాలా స్పెషల్ గానే ఉంటాయి. ఆయన మూవీస్ కి ఎప్పుడూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.  ముఖ్యంగా ‘బిచ్చగాడు’ మూవీతో ఆయన  కోలీవుడ్‌‌లోనే కాదు ఐతే టాలీవుడ్‌లో కూడా మంచి విజయాన్నిఅందుకున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కేవలం తన టాలెంట్ తో పైకి వచ్చాడు విజయ్ ఆంటోనీ. మ్యూజిక్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా దూసుకెళ్తున్నారు.  ప్రస్తుతం ఆయన నటించిన ‘బిచ్చగాడు 2’ మూవీ మే 19న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ ప్రొమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా టేస్టీ తేజ విజయ్ ఆంటోనీని, కావ్య థాపర్ ని  ఎన్నో ప్రశ్నలు వేసాడు. విజయ్ రాఘవన్ సీక్వెల్ ఎప్పుడొస్తుంది అని మీ ఫాన్స్ అడుగుతున్నారు అనేసరికి" విజయ్ రాఘవన్ 2 నెక్స్ట్ ఇయర్ రాబోతోంది" అని చెప్పాడు.

"తెలుగులో నేను డైరెక్ట్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు" అనడంతో "నాకు నచ్చిన హీరో అల్లు అర్జున్ తో మూవీ చేస్తాను" అని చెప్పాడు. " ఒక వేళా మీరు తెలుగులో మూవీలో నటించాల్సి వస్తే ఏ హీరో పక్కన చేస్తారు" అని కావ్యని అడిగాడు తేజ. "జూనియర్ ఎన్టీఆర్ తో అలాగే రాంచరణ్ తో నటిస్తాను...రంగస్థలం చూసాకా రామ్ చరణ్ నటనకి నేను ఫిదా ఇపోయా..అలాగే నాని అన్నా కూడా నాకు ఇష్టం "  అని చెప్పింది."రవితేజ గారితో దరువు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు..ఆ మ్యూజిక్ కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది. రవితేజ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది " అని అడిగాడు "చాలా నైస్ ఎక్స్పీరియన్స్ ఆయనతో చేయడం. రామోజీ ఫిలిం సిటీలో మ్యూజిక్ కంపోజ్ చేసాం. రవితేజ , శివ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ" అని చెప్పాడు విజయ్ "మరి మీరు తెలుగులో రవితేజ గారితో మూవీ చేశారు కదా ఎలా అనిపించింది ఆయనతో పని చేయడం" అని అడిగాడు. "ఆయనతో పని చేయడం చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంది. ఆయన చాలా అమేజింగ్ పర్సన్" అని చెప్పింది కావ్య థాపర్...