English | Telugu

రజనీకాంత్‌, ప్రభాస్‌ల కంటే విజయ్‌ ఆంటోనికే ఫాలోయింగ్‌ ఎక్కువ!

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, సింగర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన విజయ్‌ ఆంటోని నటుడిగా మారిన తర్వాత నకిలీ, దానికి సీక్వెల్‌గా వచ్చిన డా.సలీమ్‌ చిత్రాలు హీరోగా అతని రేంజ్‌ని పెంచాయి. 2016లో వచ్చిన ‘బిచ్చగాడు’తో ప్రభంజనం సృష్టించాడు విజయ్‌ ఆంటోని. తమిళ్‌లో, తెలుగులో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఒక విధంగా తమిళ్‌ కంటే తెలుగులోనే ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మనవాళ్ళు విజయ్‌ ఆంటోనిని ఎంతగా ఓన్‌ చేసుకున్నారంటే.. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను టీవీలో టెలికాస్ట్‌ చేస్తే టాప్‌ రేటింగ్‌ వచ్చింది.

‘బిచ్చగాడు’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘బిచ్చగాడు2’ చిత్రానికి మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా చివరికి బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. ఇప్పటివరకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, సింగర్‌గా, హీరోగా అందర్నీ అలరిస్తూ వస్తున్న విజయ్‌ ఆంటోని ‘బిచ్చగాడు 2’తో డైరెక్టర్‌గా మారాడు. సింగిల్‌ మేన్‌ ఆర్మీలా అన్నీ తానై ఈ సినిమాని పూర్తి చేశాడు. కథ, మాటలు, ఎడిటింగ్‌ వంటి శాఖలను కూడా తనే నిర్వహించాడు. హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తూ.. ఆఖరికి తన ప్రొడక్షన్‌ కంపెనీ ద్వారానే సినిమాని డిస్ట్రిబ్యూట్‌ చేశాడు. అంత కష్టపడి సినిమా చేసినందుకు నష్టం లేకుండా బయటపడ్డాడు.

ఇప్పుడు మళ్ళీ బిచ్చగాడు 2 వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శించగా 6.97 రేటింగ్‌ వచ్చింది. ఇది చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే జైలర్‌ చిత్రాన్ని టీవీలో ప్రదర్శించారు. అయినా జైలర్‌ కంటే బిచ్చగాడు2కే రేటింగ్‌ ఎక్కువగా వచ్చింది. అంతేకాదు, చిరంజీవి, ప్రభాస్‌ వంటి హీరోలు చేసిన సినిమాలకు వచ్చే రేటింగ్‌ కంటే బిచ్చగాడు 2కి ఎక్కువ వచ్చింది. ఆ విధంగా టీవీలో కూడా బిచ్చగాడు 2 సినిమా రికార్డు క్రియేట్‌ చేసింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .