English | Telugu
విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం!
Updated : Nov 2, 2023
లేటెస్ట్ గా విజయ్ నటించిన లియో మూవీ సక్సెస్ మీట్ జరిగింది. విజయ్ ఫాన్స్ భారీగా పాల్గొన్న ఈ కార్యక్రమం లో విజయ్ తన రాజకీయ ప్రస్థానం గురించి హింట్ ఇచ్చాడంటూ అని వస్తున్న వార్తలతో తమిళ చిత్ర రంగంతో పాటు తమిళనాడు రాజకీయాలని కూడా వేడెక్కిస్తుంది. ఇంతకీ విజయ్ ఏమన్నాడో చూద్దాం.
ఎంతో అంగ రంగ వైభవంగా లియో సక్సెస్ మీట్ చెన్నై నెహ్రు ఇండోర్ స్టేడియం లో జరిగింది. ఈ వేడుకులో ఎంతో అద్భుతంగా ప్రసంగించిన విజయ్ వెళ్తూ వెళ్తూ తన అభిమానులని ఉద్దేశించి నేను జనాలని నడిపించే దళపతిని అవుతా అని అనడంతో విజయ్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పకనే చెప్పినట్టయ్యిందని అంటున్నారు. అంతకంటే ముందే విజయ్ నోటితోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పించాలనే విధంగా యాంకర్ విజయ్ తో 2026 గురించి మీరేమంటారు అని అడిగింది. ఎందుకంటే 2026 లో తమినాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో విజయ్ ఏం సమాధానం చెప్తాడు అని అందరు టెన్షన్ తో ఎదురు చూస్తే విజయ్ మాత్రం చాలా కూల్ గా 2025 తర్వాత 2026 వస్తుందని అలాగే
ఆ సంవత్సరం ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతుందన్నాడు. చివరగా యాంకర్ సీరియస్‌గా సమాధానం చెప్పండి అని అడిగితే కప్పు ముఖ్యం బిగిలూ అంటూ తన బిగిల్ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పాడు.
తమిళనాడులో సినిమాలకి ,రాజకీయాలకి ఎప్పటి నుంచో సంబంధం ఉంది. సినిమా రంగం నుంచి వెళ్లిన ఏంజి రామచంద్రన్ ,జయలలిత ,కరుణానిధి లు గత 40 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రులుగా తమిళనాడు ని ఏలుతూ ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడు ని ఏలుతున్న రాజకీయ పార్టీ ,ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళు స్థాపించిన పార్టీ లే. కాబట్టి తమిళ సినిమా వాళ్ళు రాజకీయాల నుంచి దూరం అవుదామని అనుకున్న అవ్వలేరు.కాబట్టి విజయ్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని అంటున్నారు. విజయ్ అభిమానులు మాత్రం దళపతినయ్యి జనాలని ముందుకు నడిపిస్తాను అని విజయ్ చెప్పడంతో మా విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టడం ఖాయం అని సంబరాలు చేసుకుంటున్నారు.