English | Telugu
ముంబైలో రచ్చ చేస్తున్న రామ్!
Updated : Nov 2, 2023
రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అప్పటివరకు లవర్‌బోయ్ ఇమేజ్‌తో సినిమాలు చేస్తూ యూత్‌నే ఎక్కువగా టార్గెట్ చేసిన రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో ఒక్కసారిగా లుక్ మార్చాడు. ఊరమాస్ లుక్‌తో కనిపిస్తూ పెర్‌ఫార్మెన్స్ వైజ్ కూడా కొత్త టచ్ ఇచ్చాడు. దీంతో మాస్ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. తను కూడా మాస్‌ని ఎంటర్‌టైన్ చెయ్యగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. రామ్‌కి కొత్త ఇమేజ్ రావడంలో కీలక పాత్ర పోషించిన పూరి జగన్నాథ్‌కే పూర్తి క్రెడిట్ ఇవ్వాలి. ఆ సినిమా సాధించిన ఘనవిజయంతో దానికి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ రావడానికి కారణం రామ్. ఎందుకంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘స్కంద’ కోసం రామ్ బరువు పెరిగాడు. మళ్ళీ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం బరువు తగ్గి సిక్స్ ప్యాక్‌తో సిద్ధమయ్యాడు. ఇప్పుడు ముంబాయిలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్‌దత్ కీతక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. చార్మికౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 8న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.