English | Telugu

Jana nayagan:జన నాయగన్ ఆగడంపై విజయ్ సంచలన స్పీచ్   


-ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి
-రిలీజ్ ఎప్పుడు!
-ఆసలు ఉంటుందా
-విజయ్ మాటల్లో ఆంతర్యం ఏంటి


ఇళయ దళపతి 'విజయ్'(Vijay)నట విశ్వరూపాన్ని చూడాలనే అభిమానుల ఆశలకి గండి కొడుతు జన నాయగన్(Jana Nayagan)రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి. అభిమానులు అయితే రిలీజ్ ప్రకటన స్టిల్ ఈ నైట్ ప్రీమియర్స్ నుంచైనా ఉండాలని తమ ఇష్టదైవాల్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తమ ఆరాధ్య దైవం విజయ్ నుంచి జన నాయగన్ పై ఒక ప్రకటన వచ్చింది. మరి విజయ్ ఏం చెప్పాడో చూద్దాం.

ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో విజయ్ మాట్లాడుతు జన నాయగన్ రిలీజ్ ఆగడం చాలా బాధగా ఉంది ముఖ్యంగా నా నిర్మాతలని చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఇదంతా నా వల్లే. రాజకీయ రంగంలోకి రాక ముందే వీటన్నిటికీ సిద్ధపడ్డాను అని చెప్పుకొచ్చాడు. జన నాయగన్ రిలీజ్ ఆగిన విషయాలని ఒకసారి గమనిస్తే మూవీలో రాజకీయపరమైన డైలాగ్స్ ఎక్కువ మోతాదులో ఉండటం, రాజకీయ నాయకులని విమర్శించడంతో సెన్సార్ అభ్యంతరం చెప్పి సర్టిఫికెట్ ని ఇవ్వలేదు. దీంతో రిలీజ్ ఆగింది.


Also read:డైరెక్టర్ తేజ కి షాక్.. కిడ్నాప్ కేసులో భార్య, కొడుకు పై కేసు నమోదు


అక్కడ్నుంచి సెన్సార్, నిర్మాతల మధ్య చెన్నై లోని మద్రాస్ హైకోర్ట్(పేరు ఇదే) లో కేసు నడుస్తుంది. నిర్మాతలు సుప్రీం కోర్ట్ ని కూడా ఆశ్రయించగా మద్రాస్ హైకోర్ట్ లోనే తేల్చుకోమని చెప్పింది.ఈ క్రమంలో ఈ నెల 21 న వచ్చిన హియరింగ్ లో తీర్పుని రిజర్వు లో ఉంచుతున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.