English | Telugu

19 ఏళ్ళ తర్వాత నిన్న రిలీజైన ఉపేంద్ర మూవీ.. పునీత్ రాజ్ కుమార్ ఉన్నాడు


-ఉపేంద్ర మూవీ ఎందుకు లేట్ అయ్యింది!
-మూవీలో ఎవెరెవరు ఉన్నారు
-ప్రేక్షకాదరణ పొందుతుందా!

చిత్రపరిశ్రమలో కొన్నిసార్లు జరిగే విచిత్రాలు చూస్తుంటే ట్విస్ట్ లతో కూడిన చిత్రాలు ఇచ్చే థ్రిల్ కంటే ఎక్కువ థ్రిల్ ని ఇస్తుంటాయి. రీసెంట్ గా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సినిమా విషయంలో ఇదే జరిగింది. పంతొమ్మిది సంవత్సరాల తరవాత ఉపేంద్ర సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టగా, ఉపేంద్ర(Upendra)కి రిలీజ్ విషయం కూడా తెలియదు. పైగా మూవీలో పదిహేను మంది స్టార్స్ కూడా ఉన్నారు. ఏంటి ఇప్పుడు ఇదంతా నమ్మాలా అని అనుకుంటున్నారా! అయితే పూర్తి డీటెయిల్స్ చూసి మీ నమ్మకం తప్పు కాదని మీరే తెలుసుకోండి.


రక్త కాశ్మీర. ఉపేంద్ర, స్టార్ హీరోయిన్ రమ్య జంటగా 2007 లో షూటింగ్ ని ప్రారంభించుకుంది. కానీ 19 సంవత్సరాల తర్వాత నిన్నకన్నడ నాట థియేటర్స్ లో ప్రత్యక్ష మయ్యింది. ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ కాలేదనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. పంతొమ్మిది సంవత్సరాల తర్వాత థియేటర్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అయితే రిలీజ్ విషయం ఉపేంద్ర కి తెలియదనే టాక్ కన్నడ వర్గాల్లో వినపడుతుంది. ఆ మాటలకి బలాన్ని చేకూర్చేలా రిలీజ్ పై మీడియా సమావేశాలు ఏర్పాటు చేసింది లేదు. సైలెంట్ గానే స్క్రీన్ పైకి వచ్చేసింది.


Also read: నిన్ను ఆ బట్టల్లో చూడాలని ఉందన్నాడు..ఇతనేనా అతను

ఇక రక్త కాశ్మీర కి ఉన్నస్పెషల్ ఏంటంటే ఒక సాంగ్ లో పునీత్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, దర్శన్, యష్, శివరాజ్ కుమార్ ఇలా 15 మంది హీరోలు దాకా క్యామియో ఇచ్చారు. సదరు సాంగ్ 18 నిమిషాల పాటు ఉండటం విశేషం.కథ గురించి చెప్పుకోవాలంటే స్టంట్ ట్రైనర్ అనాథ పిల్లల కోసం ఒక స్టంట్ ట్రైనింగ్ స్కూల్ నడుపుతుంటాడు. ఆ అనాథ పిల్లలు టెర్రరిస్టుల బాంబు పేలుడు ప్లాన్ గురించి తెలుసుకుంటారు.

దాంతో టెర్రరిస్టులు పిల్లలను అపహరించి కాశ్మీర్ కి తీసుకెళ్తారు. ట్రైనర్, తన ప్రేయసితో కలిసి కాశ్మీర్ వెళ్లి పిల్లలని ఎలా కాపాడారనేదే చిత్ర కథ. ఏం డి ఏం ప్రొడక్షన్స్ నిర్మించగా రాజేంద్ర సింగ్ బాబు(Rajendra Singh Babu)దర్శకుడు. కంప్లీట్ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కింది.నిడివి 133 నిమిషాలు మాత్రమే. మరి ప్రేక్షకాదరణని ఏ మాత్రం అందుకుంటుందో చూడాలి.

మన శంకర వరప్రసాద్ గారు 50 రోజులు సాధ్యమేనా! ఆ హీరో ఫ్యాన్స్ ఏమంటున్నారు  

సెల్యులాయిడ్ వద్ద 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara Varaprasad Garu)జోరు యదా రాజా, తదా ప్రజా అనే రీతిలో యదా మన శంకర వరప్రసాద్ గారు, తదా ప్రేక్షకులు లాగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 350 కోట్ల రూపాయల గ్రాస్ కి పైనే  సాధించి సరికొత్త రికార్డులని సృష్టించబోతున్నానని బాక్స్ ఆఫీస్ సాక్షిగా చెప్తున్నాడు. అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్ లు లాభాల బాట పడుతుండటంతో పాటు  థియేటర్ ల ఆక్యుపెన్సీ  కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాకి అందని ద్రాక్షగా మారిన 50 రోజులని శంకర వర ప్రసాద్ ఎన్ని థియేటర్స్ లో జరుపుకుంటుందనే ఆసక్తి అందరిలో ఉంది.