English | Telugu

నయనతార కి భారీ గిఫ్ట్.. విలువ 10 కోట్లరూపాయలని అంచనా

-నయనతార కి భారీ గిఫ్ట్
-ప్రస్తుతం చిరంజీవి తో స్క్రీన్ షేర్
-విగ్నేష్ శివన్ నెక్స్ట్ మూవీ ఏంటి
-కారు విలువ 10 కోట్లరూపాయలని అంచనా


రెండు దశాబ్దాలపై నుంచి భారతీయ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించడమంటే అంతా ఆషా మాషీ కాదు. పైగా హీరో కట్ అవుట్ నే బేస్ చేసుకొని చిత్రాలు నిర్మిస్తున్న రోజుల్లో తన సత్తా చాటుతు ఉండటం అంటే చాలా గొప్ప విషయం కూడా. నెంబర్ హాఫ్ హీరోయిన్స్ కి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ నెంబర్స్ లో ముందువరుసలో ఉండే తార నయనతార(Nayanthara). ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),అనిల్ రావిపూడి(Anilravipudi)కాంబోలో తెరకెక్కుతున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' లో చేస్తుంది. మేకర్స్ ఏరి కోరి నయనతార ని ఎంచుకున్నారంటే ఆమె ప్రాభవం ఇంకా తగ్గలేదని అనడానికి ఉదాహరణ.


నిన్న నయనతార పుట్టిన రోజు. 1984నవంబర్ 18 న పుట్టిన నయనతార నిన్నటితో 41 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ పుట్టిన సందర్భంగా భర్త 'విగ్నేష్ శివన్'(Vignesh Shivan) ఆమెకి ఖరీదైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్(rolls royce Black Badge)కారుని బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు విలువ సుమారు 10 కోట్లు ఉంటుందని అంచనా. సదరు కారుపై తమ ఇద్దరి పిల్లలతో కలిసి నయనతార,విగ్నేష్ శివన్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి. ఈ సంవత్సరమనే కాదు నయనతార తన జీవితంలోకి వచ్చినప్పటినుంచి జరిగే ప్రతి పుట్టిన రోజుకి విగ్నేష్ శివన్ ఆమెకి ఖరీదైన కారులని బహుమతిగా ఇస్తూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన కారు విజువల్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

also read:సెకండ్ సాంగ్ రిలీజ్ టైం ఇదేనా!.. ఆ సాంగ్ కి పోటీగా తెస్తున్నారా!

తమిళ సినీ రంగంలో పేరు పోసిన దర్శకుడిగా గుర్తింపు పొందిన విగ్నేష్ శివన్ ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి లతో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ ని తెరకెక్కిస్తున్నాడు. గత అక్టోబర్ 18 న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడి డిసెంబర్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .