English | Telugu

ఓటీటీలోకి విద్యావాసుల అహం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

తెలుగునాట మే 13న ఎన్నికల కావడంతో నిన్నటివరకు అందరి చూపు వాటిపైనే ఉంది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో మళ్ళీ సినిమాల వైపు చిన్నగా మనసు మళ్లుతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా సినిమాల్లేవు. ఇలాంటి తరుణంలో ఇంట్లో కూర్చునే ఏ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కి ఓటీటీ వేదికపై కొత్త కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి.

తాజాగా ఓటీటీలో ఫహాద్ ఫాజిల్ నటించిన ' ఆవేశం' రిలీజైంది. ఇక 'ఎస్.ఐ.టి' తెలుగు మూవీ, వరుణ్ సందేశ్ నటించిన 'చిత్రం చూడరా' మూవీ, 'ఆరువి' తమిళ్ డబ్నింగ్ మూవీలు ఉన్నాయి. రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ నటించిన ఓ సినిమా విడుదల తేదీ ఖరారైంది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో, హీరోయిన్లుగా చేసిన చిత్రం ' విద్యా వాసుల అహం'. ఈ సినిమాకి మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించాడు. ఈ నెల 17 నుండి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆహా ప్రకటించింది. అహంతో కూడిన ప్రేమకథని చెప్పడానికి విద్యా, వాసు ఇద్దరు వస్తున్నారంటు ఓ పోస్టర్ ని రీలీజ్ చేసారు మేకర్స్. విద్యా, వసు ఇద్దరికి అహం ఉంటుంది. అయితే ఇద్దరిలో ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? ఎవరు నెగ్గారు? అసలు కలిసే ఉన్నారా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇందులో తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, అభినయ కీలక పాత్రల్లో నటించారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.