English | Telugu

ఇదే చివరి సినిమా.. వెట్రిమారన్ సంచలన నిర్ణయం 

భారతీయ చిత్ర పరిశ్రమలో తమిళ దర్శకుడు 'వెట్రిమారన్'(Vetromaaran)శైలి ఎంతో విభిన్నమైనది. మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)సైతం 'వెట్రి మారన్' దర్శకత్వంలో నటించాలని ఉందనే కోరికని వ్యక్తం చేసాడు. దీన్ని బట్టి 'వెట్రిమారన్' దర్శకత్వ ప్రతిభ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.ఎటువంటి భారీతనం, గ్రాఫిక్స్ ల జోలికి వెళ్లకుండా, మనుషుల జీవితాలు, ఆచారాలు, సామాజిక సమస్యలకి 'లవ్ అండ్ ఫ్యామిలీ' ఎమోషన్స్ ని పండించడం వెట్రి మారన్ దర్శకత్వం యొక్క స్టైల్. అందుకే ఆయన సినిమాలు మనుషులతో ప్రయాణం చేస్తుంటాయి. ఆడుకాలం, అసురన్, విసరానై, వంటి చిత్రాలకి ప్రతిష్టాత్మక 'నేషనల్ అవార్డు' ని సైతం పలు విభాగాల్లో అందుకున్నాడు.

వెట్రిమారన్ 2012 లో నిర్మాతగా మారి 'గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ' అనే నిర్మాణ సంస్థని ప్రారంభించాడు. ఉదయమ్ NH4, పోరియాలన్, కాకా ముట్టై, ఇనారి, కోడి, అన్నంకు జై, వడ చెన్నై వంటి చిత్రాలు వచ్చాయి రీసెంట్ గా 'బ్యాడ్ గర్ల్' అనే మూవీని, బాలీవుడ్ లెజండ్రీ యాక్టర్ అండ్ డైరెక్టర్ 'అనురాగ్ కశ్యప్' తో కలిసి నిర్మించగా, ఈ నెల 5 న రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ విషయంలో సెన్సార్ బోర్డుతో వెట్రిమారన్ పోరాడాల్సి వచ్చింది. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు దర్శకుడిగా ఉండడం సులభం, కానీ నిర్మాతగా సినిమాలను నిర్మించడం సులభం కాదు. దర్శకుడిగా ఉంటే మన పని మనం చేసుకుంటాం. కానీ నిర్మాత ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి. చివరికీ టీజర్ కింద వచ్చే కామెంట్స్ కూడా చదవాలి. నటీనటులు, ప్రకటనలు సినిమా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి. నా మరో చిత్రం 'మానుషి' మూవీకి సంబంధించి రివైజింగ్ కమిటీ, కోర్టు ద్వారా వెళ్లింది. బ్యాడ్ గర్ల్ సినిమా కూడా అనేక పోరాటాలతో కోర్టు వరకు వెళ్లింది. చిన్న నిర్మాత మనుగడ సాగించడం కష్టం. కాబట్టి గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీని మూసివేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

బ్యాడ్ గర్ల్(Bad Girl),మానుషి(Manushi)చిత్రాలు రెండు కూడా విభిన్న కధాంశాల నేపథ్యంలో ఒక యువతీని ప్రధాన పాత్ర చేసుకొని తెరకెక్కాయి. మానుషీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలని తొలగించాలని 'చెన్నై హైకోర్టు'(Chennai Highcourt)ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .