English | Telugu

తెలుగు మూవీలో "బాడీగార్డ్"గా వెంకటేష్

తెలుగులో మూవీ "బాడీగార్డ్"గా విక్టరీ వెంకటేష్ నటించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మళయాళంలో ఈ "బాడీగార్డ్" చిత్రాన్ని ముందుగా నిర్మించారు. అక్కడ ఘనవిజయం సాధించగా, తమిళంలో విజయ్ హీరోగా పునర్నిర్మిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో "బాడీగార్డ్" చిత్రం విజయం సాధించలేదు. ఇప్పుడీ "బాడీగార్డ్" చిత్రాన్ని తెలుగు మూవీగా, విక్టరీ వెంకటేష్ హీరోగా, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ తెలుగు మూవీ "బాడీగార్డ్" లో ముందుగా హీరోగా నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, సునీల్ ల పేర్లు వినపడినా చివరికి ఈ "బాడీగార్డ్"తెలుగు రీమేక్ లో వెంకటేష్ హీరోగా నటిస్తున్నారని నిర్ణయించబడింది.ఈ "బాడీగార్డ్" మూవీని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోయే ఈ "బాడీగార్డ్" మూవీకి "డాన్ శీను" ఫేం మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించనున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోయే ఈ "బాడీగార్డ్" మూవీలో హీరోయిన్ ఎవరు...? అన్నది ఇంకా తెలియరాలేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.