English | Telugu

Irugapatru Movie Review: ‘ఇరుగపాట్రు’ మూవీ రివ్యూ



మూవీ : ఇరుగపాట్రు
నటీనటులు: శ్రద్ధ శ్రీనాథ్, విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రీ, అబర్నథి, సానియా అయ్యప్పన్
రచన: మహారాజ్ దయాలన్
ఎడిటింగ్: జె. వి మణికందన్ బాలాజీ
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ: గోకుల్ బినోయ్
నిర్మాతలు: ఎస్. ఆర్ ప్రకాష్ బాబు, ఎస్. ఆర్ ప్రభు, పి. గోపీనాథ్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యువరాజ్ దయాలన్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్

కొన్ని సినిమాలు ఇతర భాషలలో విడుదలై తెలుగులోకి అనువదించాక హిట్ అవుతున్నాయి. అలాంటివాటికి ఓటీటీల్లో క్రేజ్ ఉంది. అలాంటిదే 6 అక్టోబర్ 2023 లో తమిళ్ లో విడుదలై మిశ్రమ స్పందనలు అందుకున్న 'ఇరుగపాట్రు' మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఇతర భాషలలో విడుదలైంది. మరి ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం...


కథ:

మిత్ర అనే ఒక ఆవిడ సైకాలిజిస్ట్ గా చేస్తూ తన భర్త మనోహర్ తో హ్యాపీ లైఫ్ ని కొనసాగిస్తుంటుంది‌. మొదటగా తను ఒక సెమినార్ ని కండక్ట్ చేస్తుంది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలతో మిత్ర దగ్గరికి వస్తుంటే, వారికి సరైన అవగాహన కల్పించి పంపిస్తుంది. అయితే అర్జున్ మొదటగా తన భార్య అసలు మాట్లడట్లేదని, దగ్గరికి వెళ్తే దూరం వెళ్తందని వాదనతో మిత్ర దగ్గరికి వస్తాడు. మిత్ర అంతా విని తన భార్యని రమ్మని చెప్తుంది. ఆమెతో మాట్లాడాక అసలు విషయం మిత్రకి అర్థమవుతుంది. ఆ తర్వాత అదే తరహాలో పవిత్ర వచ్చి తన భర్త విడాకులు కావలన్నాడని చెప్తుంది. ఆమె భర్తని రమ్మని చెప్పి సమస్యని తెలుసుకుంటుంది మిత్ర. అయితే ఇలా తన దగ్గరికి విభిన్న సమస్యలతో వచ్చినవాళ్ళకి సరైన అవగాహన కల్పించే క్రమంలో తనకి కూడా ఇలాంటి సమస్య ఒకటి వస్తుంది. మరి ఆ సమస్యని మిత్ర పరిష్కారించుకోగలిగిందా? భార్యాభర్తలని కలిపిందా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితాలలో భార్యభర్తలు ఒక గంట కూడా మనసు విప్పి మాట్లాడుకోవట్లేదని సెమినార్ లో చెప్తుంటుంది మిత్ర. అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలే విడాకుల దాకా వస్తాయంటు మిత్ర జాగ్రత్తపడుతుంది. అయితే అర్జున్ అనే ఒక వ్యక్తి తమ దగ్గరకు వచ్చి వారి భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్య, రంగేశ్ అనే వ్యక్తి చెప్పిన ‌సమస్య, ఇలా ఒక్కొక్కరు మిత్ర దగ్గరికి వచ్చి చెప్పే సమస్యలు ఎక్కడ తన లైఫ్ లోకి వస్తాయోనని భావిస్తుంది. అలాగే మిత్ర, మనోహర్ ఇద్దరి మధ్య అసలు ఒక్కటంటే ఒక్క గొడవ కూడా రాకపోవడంతో అందరు ఆశ్చర్యపోతారు.

సినిమా ప్రథమార్ధం వరకు ఇతరుల మధ్య వచ్చే సమస్యలని పరిష్కరించే మిత్రకి తన భర్తకి మధ్య గొడవ జరుగుతుంది. దాంతో కథ మరింత ఆసక్తిగా మారుతుంది. ఏ గొడవ పడకుండా ఉండటం కూడా సమస్యే అనే విషయం మిత్రకి తర్వాత అర్థమవుతుంది. పేపర్ లో వచ్చిన ఒక న్యూస్ తన జీవితాన్ని ఇలా ఇంపాక్ట్ చేస్తుందా అని మిత్ర భావిస్తుండగా, తన భర్త మనోహర్ కి ఒక నిజం తెలుస్తుంది. అ నిజమేంటనేది, దాన్ని వాళ్ళిద్దరు ఎలా పరిష్కారించుకున్నారనే ఉత్కంఠతో కథ పూర్తిగా ఒక ఇంటెన్స్ తో సాగుతుంది. అయితే కథలో అర్జున్ , రంగేశ్ అనే ఇద్దరు జీవితాల మధ్య సమస్యలు సమాజాన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.

అయితే ప్రథమార్ధంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ద్వితీయార్థంలో కూడా అలానే ఉండటంతో ప్రేక్షకులకి కాస్త నిరాశ కల్గించిన పెళ్ళైన వారికి ఇవన్నీ ఒక మంచి సందేశాన్ని ఇస్తాయనే చెప్పాలి. ఏ సమస్యకైన పరిష్కారం ఉంటుంది. చిన్న చిన్న గొడవలకి విడిపోకూడదంటూ యువరాజ్ దయాలన్ చూపించే ప్రతీ సీన్ ఆకట్టుకుంది. కథలో కొత్తదనం, మాటలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఒకానొక దశలో పెళ్ళికి ముందు ఉన్న మనుషులు పెళ్ళి తర్వాత ఉండలేరంటూ చెప్తూనే వారి లైఫ్ లో గడిపిన చిన్న చిన్న సంతోషాలని వెతికి పట్టుకుని సాగిపోవాలంటూ చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ యువరాజ్ దయాలన్. అయితే ఇది కామన్ ఆడియన్స్ కి వన్ టైమ్ చూడొచ్చు ఎందుకంటే పెళ్ళి తర్వాత సమస్యలు ఉంటాయని చెప్పడం, వాటిని ఎలా పరిష్కారించుకోవాలో చూపించాడు. మెచురిటీ ఉన్న స్టోరీ, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మెచుర్డ్ సంభాషణలో కొన్ని పదాలు ఇబ్బంది పెడతాయి. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కథనం నెమ్మదిగా సాగిన రిలేషన్ షిప్ లో బాగుండాలంటే ఒక మెచురిటీ ఉండాలంటూ కొనసాగుతుంది. ప్రతీ సీన్ లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులని కట్టిపడేస్తాయి. మహారాజ్ దయాలన్ రాసుకున్న కథని యువరాజ్ దయాలన్ చక్కగా తీర్చిదిద్దాడు. జస్టిన్ ప్రభాకరన్ ‌అందించిన మ్యూజిక్ బాగుంది. గోకుల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. జె.వి మణికందన్ బాలాజీ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

సైకాలజిస్ట్ మిత్ర పాత్రలో శ్రధ్ధ శ్రీనాథ్ ఆకట్టుకుంది. మెచుర్డ్ గా థింకింగ్ చేసే మనోహర్ పాత్రలో విక్రమ్ ప్రభు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. రంగేశ్ గా విదార్థ్, అర్జున్ గా శ్రీ, పవిత్ర గా అబర్నథి, దివ్యగా సానియా అయ్యపన్ తమ తమ పాత్రాలకి న్యాయం చేశారు.


తెలుగువన్ పర్ స్పెక్టివ్:

పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలకు పరిష్కారం చెప్తూ తీసిన ఈ సినిమాని కామన్ ఆడియన్స్ ఒకసారి చూడొచ్చు. పెళ్ళైన వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్: 3 / 5

✍🏻. దాసరి మల్లేశ్

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.