English | Telugu

మే 6 న రవితేజ "వీర" ఆడియో రిలీజయ్యింది

రవితేజ "వీర" ఆడియో రిలీజ్ "మే" 6 వ తేదీన హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో సాయంత్రం 7 గంటలకు జరిగింది. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, "రైడ్" ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "వీర". రవితేజ "వీర" చిత్రంలో హీరో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కబడ్డి చిట్టి అనే పక్కా మాస్ పాత్రలో నటిస్తూండగా, సొట్టబుగ్గల సుందరి తాప్సి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటుస్తుంది.

రవితేజ "వీర" చిత్రానికి యువసంగీత దర్శకుడు తమన్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. రవితేజ "వీర" చిత్రం యొక్క ఆడియో హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో "మే" 6 వ తేదీ రాత్రి 7 గంటలకు, సంగీత దర్శకుడు తమన్ తొలి సి.డి.ని "డాన్ శీను" దర్శకుడు మలినేని గోపీచంద్ అందుకోగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ చేయబడింది. రవితేజ "వీర" ఆడియోలో మొత్తమ ఏడు పాటలున్నాయనీ, ఏపాటకాపాట సినిమాకు ఉపయోగపడేలా ఉంటుందనీ, రవితేజ గత చిత్రాలైన "ఆంజనేయులు, కిక్, డాన్ శీను, మిరపకాయ్" చిత్రాల ఆడియోకు ఏ మాత్రం తగ్గకుండా రవితేజ "వీర" ఆడియో ఉంటుందని ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ తెలియజేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.