English | Telugu
భయంతో అల్లాడిపోతున్న అగ్రనటుడు!
Updated : Sep 27, 2023
ఆయన ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి ఎన్నో విభిన్న చిత్రాలని అందించిన హీరో. మాస్ అండ్ క్లాస్ అండ్ ఫ్యామిలీ సినిమాల్లో నటించి ఎంతో మందికి అభిమాన కథానాయకుడుగా మారిన హీరో. ఆయన ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నేను పలానా వాటికి చాలా భయపడతానని చెప్పి ఒక్కసారిగా అందర్నీ షాక్ కి గురిచేశాడు.
జగపతిబాబు....తెలుగు సినీ పరిశ్రమకి లభించిన ఒక గొప్ప నటుడు. ప్రొడ్యూసర్ కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసి మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో విభిన్న సినిమాల్లో హీరోగా నటించి తన స్టామినాని తెలుగు చిత్ర పరిశ్రమకి తెలియచేసాడు. ఆయన హీరోగా చేసే సమయంలో ఎంతో మంది అగ్ర హీరో లు ఉన్నా కూడా తన కంటూ ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని సొంతంగా అభిమాన సంఘాలని కూడా సంపాదించుకున్నాడు. అలాగే ఆయన వాయిస్ కి ఎంతో మంది ఫాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా వీరవిహారం చేస్తూ తన అభిమానులని రంజింపచేస్తున్నాడు.
ఇంక అసలు విషయానికి వస్తే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఆయనకీ చిన్నప్పట్నుంచి దెయ్యాలు అంటే చాలా భయం అని, అలాగే మనిషి చనిపోయాక ఏమయిపోతాడు అసలు చనిపోయాక ఏమి జరుగుతుంది ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం కంటే బెటర్ గా మన లైఫ్ ఉంటుందా లేదంటే అసలు ఎలా ఉంటుంది అనే ఆలోచనల్లో ఎప్పుడు భయపడుతూ ఉంటానని జగపతి బాబు ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అలాగే ఇంకో విషయానికి కూడా చాలా భయపడతానని చెప్పుకొచ్చాడు. ఆ విషయం ఏంటంటే ఇరుకుగా ఉన్న సందుల్లో కి వెళ్లాలంటే చాలా భయం అని చెప్పాడు . ఈ విషయాలన్నీ విన్న ప్రేక్షకులందరూ జగపతి బాబు అంటేనే డేరింగ్ అండ్ డాషిండ్ హీరో అని పైగా ఎలాంటి విషయాల్ని అయినా దైర్యంగా చెప్పే జగపతి బాబు కి మరి ఇంత భయమా అని అనుకుంటున్నారు.