English | Telugu
వరుణ్ తేజ్ కొత్త అవతారం..ఈసారి హిట్ ఖాయమా!
Updated : Mar 24, 2025
విభిన్నచిత్రాలతో అభిమానులని,ప్రేక్షకులని అలరించే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun Tej)గత కొంత కాలంగా వరుస పరాజయాల్నిచవి చూస్తున్నాడు.2019 లో వచ్చిన సోలో హిట్ గద్దలకొండ గణేష్,విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన ఎఫ్ 3 తో మాత్రమే హిట్ లని అందుకున్నాడు.ఆ తర్వాత వచ్చిన గాండీవదారి అర్జున,ఆపరేషన్ వాలంటైన్,మట్కా తో హ్యాట్రిక్ పరాజయాలని అందుకున్నాడు.
దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలనే లక్ష్యంతో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi)దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు.ఇండో కొరియర్ హర్రర్ కామెడీ గా తెరకెక్కుతుండగా ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ ,చిత్ర బృందంపాల్గొనడంతో పాటు ప్రముఖ దర్శకుడు క్రిష్(Krish)వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి,సోదరి నీహారిక(Niharika Konidela)పాల్గొని మూవీ విజయవంతమవ్వాలని మేకర్స్ కి తమ అభినందలు తెలియచేసారు.
వరుణ్ కెరీర్ లో ఈ మూవీ 15 వ చిత్రంగా తెరకెక్కుతుండగా యువిక్రియేషన్స్,ఫస్ట్ ఫ్రెమ్ ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఫస్ట్ ఫ్రెమ్ సంస్థలో వరుణ్ గతంలో 'కంచె' చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.క్రిష్ ఈ సంస్థలో వన్ ఆఫ్ ది పార్టనర్. వరుణ్ సరసన రితికా నాయక్ జోడి కట్టనుండగా మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.