English | Telugu

నేను అమాయకుణ్ణి-వరుణ్ సందేశ్

"నేను అమాయకుణ్ణి" అని వరుణ్ సందేశ్ అంటున్నాడు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లంగర్ హౌస్ వద్ద నైజీరియన్ దేశస్థుడు ఫెడ్రిక్స్ తో పాటు డాక్టర్ సిద్ధార్థ రెడ్డి అనే భారతీయుడు కూడా కొకైన్ తో పోలీసులకు పట్టుబడ్డారు. వాళ్ళని ఇంటరాగేట్ చేయగా, సిద్ధార్థ రెడ్డి చెప్పిన విషయాల్లో తాను, యువ సినీ హీరో వరుణ్ సందేశ్, నటుడు అభిషేక్, నిర్మత ఉప్పల పాటి రవి కలసి హిమాయత్ నగర్ లో ఉన్న తన ఇంట్లో కోకైన్ తీసుకునే వారమని చెప్పాడు.

దీని మీద వివరణ కోరగా "నేను నిర్దోషిని. నాకు ఈ కొకైన్ , డ్రగ్స్ వంటి ఎటువంటి దురలవాట్లూ లేవు. నేనెప్పుడూ సిద్ధార్థ రెడ్డి ఇంటికి వెళ్ళలేదు. ఇక వారి దగ్గర నా ఫోన్ నంబర్ ఉండటం గురించి నేనేం చెప్పలేను. ఒక హీరోగా నాకున్న పాపులారిటీ వల్ల అనేకమంది నా ఫోన్ నంబర్ సంపాదించుకుంటారు. అంతమాత్రాన నాకూ వాళ్ళకీ లింకులున్నాయనటం అన్యాయం" అని అన్నాడు వరుణ్ సందేశ్. ఒకప్పుడు యువ హీరో నాని మీద కూడా ఇలాంటి నిందలు రావటం దాన్ని నాని నిర్ద్వందంగా ఖండించటం అన్ని ఛానల్స్ లో లైవ్ కి వచ్చి "ఏ మెడికల్ టెస్ట్ కైనా నేను సిద్ధామే" అని మరీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు. మరి వరుణ్ సందేశ్ ఏం చేస్తాడో చూడాలి మరి.