English | Telugu

మీలో ఒక‌దాన్నేనంటున్న వ‌ర‌ల‌క్ష్మీ

నేను మీలో ఒక‌దాన్నే... అందుకే ఈ పోస్ట్ అంటూ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇంత‌కీ ఉన్న‌ట్టుండి వ‌ర‌ల‌క్ష్మీ అలాంటి పోస్టు ఎందుకు పెట్టిన‌ట్టు? అని అనుకుంటున్నారా? డీటైల్స్ చదివేయండి మ‌రి! వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఇన్‌స్టా ఫాలోయ‌ర్స్ సంఖ్య రెండు మిలియ‌న్ల‌కు చేరుకుంది. షూటింగ్ స‌ర‌దాల‌తో పాటు, స్టాఫ్‌తోనూ, ఇంట్లో కుక్క‌పిల్ల‌తోనూ, వ‌ర్క‌వుట్ చేస్తున్నప్పుడు తీసుకున్న వీడియోల‌తో త‌న ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంటారు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌. అందుకే ఆమె ఇన్‌స్టా ఫాలోయ‌ర్ల సంఖ్య ఝుమ్మంటూ పెరిగారు. అలా ఉన్న‌ప‌ళాన ఫాలోయ‌ర్స్ రీచ్ రెండు మిలియ‌న్లు అని చూసుకునేస‌రికి వ‌ర‌ల‌క్ష్మికి చాలా ఆనందంగా అనిపించిందట‌. ఆ ఆనందంతోనే గెంతులు వేస్తూ, స్టెప్పులు వేస్తూ వీడియో చేశారు. ఆ వీడియో షేర్ చేశారు.

లాస్ట్ ఇయ‌ర్ య‌శోద‌లో నెగ‌టివ్ రోల్ చేశారు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌. స‌మంత‌, వ‌ర‌ల‌క్ష్మీ ఈక్వ‌ల్ ఇంపార్టెన్స్ ఉన్న కేర‌క్ట‌ర్స్ చేసిన ఆ సినిమా టీవీ ప్రసారాల‌కు కూడా సిద్ధ‌మైంది. మ‌ధు కేర‌క్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మీ ఒదిగిపోయార‌ని అంద‌రూ ప్ర‌శంసించారు. ఈ ఏడాది వీర‌సింహారెడ్డిలో ఎవ‌రూ ఊహించ‌ని రోల్ చేశారు వ‌ర‌ల‌క్ష్మి. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య చెల్లెలిగా క‌నిపించారు. అన్న‌ను చంపిన చెల్లెలిగా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందు నిలిచారు. బాల‌య్య‌ను ఎదిరించి ఆమె చేసిన స‌న్నివేశాలు చూసి నంద‌మూరి ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డ్డార‌ట వ‌ర‌ల‌క్ష్మీ. అయితే త‌మ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటార‌ని బాల‌కృష్ణ ఇచ్చిన ధైర్యంతో ఆ స‌న్నివేశాలు చేసేశాన‌ని అన్నారు. త్వ‌ర‌లోనే వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ గ్రాండ్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తార‌నే వార్త‌లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మూవీస్ లో ఆమె ఫైట్స్ చేసే ఉద్దేశంలో ఉన్నార‌ట‌. అయితే అది ఏమూవీలో అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ అంటున్నారు వ‌ర‌ల‌క్ష్మీ స‌న్నిహితులు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.