English | Telugu
'ఉస్తాద్' పబ్లిక్ టాక్.. కీరవాణి కొడుక్కి మళ్ళీ దెబ్బ పడింది..
Updated : Aug 12, 2023
'యమదొంగ', 'మర్యాద రామన్న' వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో బాలనటుడుగా ఆకట్టుకున్నాడు కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా కోడూరి. 'మత్తు వదలరా' వంటి విజయవంతమైన సినిమాతో హీరోగా అవతారమెత్తిన శ్రీ సింహా.. ఆ తరువాత వరుసగా పరాజయాలు చూశాడు. 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త', 'భాగ్ సాలే'.. ఇలా హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకున్న ఈ యంగ్ హీరో.. తాజాగా 'ఉస్తాద్'తో జనం ముందుకు వచ్చాడు.
'జైలర్', 'భోళా శంకర్' వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైన వారంలోనే వచ్చిన 'ఉస్తాద్'.. శనివారం (ఆగస్టు 12) తొలి ఆటకే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దాన్ని తెరపైకి తీసుకువచ్చిన విధానం మాత్రం ఆసక్తికరంగా లేదంటున్నారు పబ్లిక్. ఉస్తాద్ అనే బైక్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఎమోషన్స్ వర్కవుట్ అయిఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేదని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కావ్య కళ్యాణ్ రామ్ తో లవ్ ట్రాక్ కూడా సోసోగా ఉందని అంటున్నారు. మొత్తమ్మీద.. కీరవాణి చిన్న కొడుక్కి 'ఉస్తాద్' రూపంలో వరుసగా నాలుగో దెబ్బ (పరాజయం) పడిందన్నది పబ్లిక్ టాక్.