English | Telugu

దటీజ్ సూపర్ స్టార్.. రెండో రోజూ జోరు తగ్గని 'జైలర్'..  అర్థమైందా రాజా.. !

బాక్సాఫీస్ కి సరికొత్త ఊపు తీసుకొచ్చే ఇండియన్ స్టార్స్ లో రజినీకాంత్ ఒకరు. యావరేజ్ అనే టాక్ వచ్చినా చాలు.. వసూళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళగల సత్తా సూపర్ స్టార్ సొంతం. అందుకు తాజా నిదర్శనం.. 'జైలర్'. గురువారం (ఆగస్టు 10) జనం ముందు నిలిచిన 'జైలర్'.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.91.20 కోట్ల గ్రాస్ (రూ.44.75 కోట్ల షేర్) వసూలు రాబట్టిన 'జైలర్'.. రెండో రోజు కూడా హవా చాటింది. ప్రపంచవ్యాప్తంగా.. సెకండ్ డే రూ. 53 కోట్ల వరకు గ్రాస్ చూసింది. షేర్ విషయానికి వస్తే.. రూ. 26.10 కోట్ల వరకు ఆర్జించింది. ఇక రెండు రోజులు కలిపి రూ. 144 కోట్ల గ్రాస్ (రూ. 70.85 కోట్ల షేర్) చూసింది. శని, ఆదివారాల్లోనూ అలాగే పంద్రాగస్టు రోజున మంచి వసూళ్ళు రాబట్టగలిగితే గనుకరూ. 124 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగిన 'జైలర్'.. బ్రేక్ ఈవెన్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా 'జైలర్' రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు:

తమిళనాడు – రూ. 39.30 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాలు - రూ. 17.25 కోట్ల షేర్ (తమిళ వెర్షన్ తో కలిపి)
కర్ణాటక- రూ. 17.05 కోట్ల షేర్
కేరళ – రూ. 9.65 కోట్ల షేర్
రెస్టాఫ్ ఇండియా – రూ.3.95 కోట్ల షేర్
ఓవర్సీస్ – రూ. 56.80 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్స్ – రూ. 144 కోట్ల గ్రాస్ (రూ. 70.85కోట్ల షేర్)

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.