English | Telugu

తొలిసారి  ఆ ప‌ని చేయ‌నున్న ర‌జినీకాంత్‌

సూప‌ర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు జైల‌ర్ స‌క్సెస్ కిక్ ఎంజాయ్ చేశారు. సాలిడ్ హిట్ కోసం ఆయ‌న అభిమానులంద‌రూ ఎదురు చూస్తే.. ఈ ఏడాది వ‌చ్చిన జైల‌ర్ సినిమా రూ.600 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో ఆయ‌న త‌దుప‌రి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తలైవ‌ర్ నెక్ట్స్ మూవీస్‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ రూపొందిస్తంఓది. అందులో ఒక‌టి లాల్ స‌లాం. ఇందులో ఆయ‌న కీల‌క పాత్ర‌లో మాత్ర‌మే న‌టించారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇక ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న మ‌రో భారీ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. అదే త‌లైవ‌ర్ 170. ఇందులో ర‌జినీకాంత్‌తో పాటు పాటు బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్, మ‌ల‌యాళ స్టార్స్ ఫ‌హాద్ ఫాజిల్, మంజిమ వారియ‌ర్‌తో పాటు తెలుగు సినీ ఇండ‌స్ట్రీ నుంచి రానా ద‌గ్గుబాటి న‌టించ‌నున్నారు.

తాజాగా త‌లైవ‌ర్ సినిమాకు సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. అదేంటంటే త‌న 170వ చిత్రంలో ర‌జినీకాంత్ క‌న్యాకుమారి స్లాంగ్‌లో మాట్లాడ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఈ ప్ర‌య‌త్నాన్ని చేయ‌లేదు. ఆయ‌న కెరీర్‌లోనే ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌టం ఇదే తొలిసారి అవుతుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలంటున్నాయి. అలాగే ఆయ‌న లుక్‌ను కూడా డైరెక్ట‌ర్ టి.జ్ఞాన‌వేల్ కొత్త‌గా ప్లాన్ చేస్తున్నారు. జై భీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇదే.

ర‌జినీకాంత్ త‌న 170వ సినిమాలో ఎన్‌కౌంట‌ర్స్‌కు వ్య‌తిరేకంగా పోరాడే రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లోక‌నిపించ‌బోతున్నట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఇస‌నిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేస్తారనే వార్తలు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో సినిమా ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.