English | Telugu

‘నేను ఎవరి దయ వల్లనో ఎదగలేదు..’ ఉపాసన కొణిదెల సంచలన వ్యాఖ్యలు!

మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌గా ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. భర్తకు తగ్గ భార్యగా, అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా, ఒక తల్లిగా, వ్యాపార వేత్తగా, సామాజిక కార్యకర్తగా ఉపాసన కొణిదెల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా తన ఆలోచనలను అందరితోనూ పంచుకుంటూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. ఎమోషనల్‌గా చేసిన ఒక పోస్టు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ ప్రతాపరెడ్డి మనవరాలుగా, రామ్‌చరణ్‌ భార్యగా ఉండడం వల్ల తాను ప్రత్యేకమైన వ్యక్తిని కాలేదని, అన్నిరకాల సమస్యలను ఎదుర్కొనే శక్తే దానికి కారణం అని పేర్కొన్నారు. అసలు ఉపాసన పెట్టిన పోస్ట్‌ ఏమిటో ఒకసారి చూద్దాం.

‘నేను ఎవరి దయ వల్ల ఎదగలేదు. ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేచి ముందుకు వచ్చాను. నా మీద నాకే నమ్మకం. అసలైన బలం ఆత్మగౌరవంలో ఉంటుంది. అది డబ్బు, హోదా, ఫేమ్‌లలో ఉండదు. అహంకారం గుర్తింపుని కోరుకుంటుంది, కానీ ఆత్మగౌరవం ఎలాంటి శబ్దం రాకుండా గుర్తింపును సంపాదిస్తుంది’ అంటూ భావోద్వేగంతో పోస్ట్‌ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఖాస్‌ ఆద్మీ పార్టీ’ అనే ఆలోచనను పంచుకోవడంలో భాగంగా ఈ పోస్ట్‌ చేశారు. ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.