English | Telugu

‘మాస్‌ జాతర’ రిలీజ్‌పై మేకర్స్‌ కీలక ప్రకటన!

రవితేజ, భాను భోగవరపు కాంబినేషన్‌లో నాగవంశీ నిర్మిస్తున్న ‘మాస్‌ జాతర’ చిత్రం ఆగస్ట్‌ 27న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాను ఈ తేదీకి విడుదల చెయ్యడం లేదని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్‌. ఈ డేట్‌కి సినిమా రావడం లేదని, వాయిదా వేస్తున్నారని గత కొన్నిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తదుపరి రిలీజ్‌ డేట్‌ ఏమిటి అనేది ప్రస్తావించలేదు. ‘మాస్‌ జాతర’ సినిమాను ప్రారంభించినపుడు 2025 సంక్రాంతికి రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేసుకున్నారు. అయితే నిర్మాణపరమైన సమస్యల కారణంగా ఆ డేట్‌కి రిలీజ్‌ అవ్వలేదు. ఆ తర్వాత ఆగస్ట్‌ 27న రిలీజ్‌ చెయ్యాలని ఫిక్స్‌ అయ్యారు.

ఈ సినిమాను వాయిదా వేయడం వెనుక కారణాలను చిత్ర యూనిట్‌ వివరిస్తూ రెండు వారాలకుపైగా జరిగిన సమ్మె వల్ల తమ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సినిమాకి సంబంధించి ఒక పాట, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇంకా మిగిలి ఉన్నాయి. సమ్మె కారణంగా షూటింగ్‌ జరగలేదు. దాంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వెయ్యక తప్పలేదు. బ్యాలెన్స్‌ ఉన్న వర్క్‌ను వేగంగా పూర్తి చేసిన తర్వాత కొత్త రిలీజ్‌ డేట్‌ను ఎనౌన్స్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది.

రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో వచ్చిన ‘ధమాకా’ చిత్రం సూపర్‌హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రవితేజ హీరోగా నటించిన నాలుగు సినిమాలు వరసగా ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో ‘మాస్‌ జాతర’పైనే రవితేజ హోప్స్‌ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగానే సినిమాను రూపొందించారని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. వరస పరాజయాలతో ఉన్న రవితేజను భాను భోగవరపు మళ్ళీ హిట్‌ ట్రాక్‌లోకి తీసుకొస్తారేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.