English | Telugu

ఉదయం అస్తమయం అంతా 'చిత్రం'


బర్త్ డే బాయ్ ఉదయ్,
లవర్ బాయ్ కి బర్త్ డే విషెస్ అంటూ హెడ్డింగులు..
ఉదయ్ సినిమా100 డేస్ ఫంక్షన్,
ప్లాటినం డిస్క్ ఫంక్షన్,
ఉదయ్ బర్త్‌డే పార్టీ,
మ్యారెజ్ యానివర్సరీ జరుపుకుంటున్న ఉదయ్ కిరణ్
అని రాయవలసిన చోట ఉదయ్ కిరణ్ జయంతి అని రాయటం కష్టంగా వుంది.



చిత్రం సినిమా చూసిన ప్రతి టీనేజర్‌కి
ఉదయ్‌ ఒక కొత్త ఊహ, కొత్త ఆశ కలిగించాడు. అమ్మాయిలు ఇలాంటి చాక్లెట్ బాయ్ కావాలనుకుంటే, అబ్బాయిలు నేను హీరో అయిపోవచ్చు అనుకున్నారు.
నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలతో ప్రేమికులకు ఆరాధ్యుడిగా మారిపోయాడు. శ్రీరాం సినిమాలో పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో మాస్ ఆడియెన్స్ కు కూడా దగ్గరయ్యాడు.
ఆ తర్వాత కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించాడు. సినిమాల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే గొప్ప విజయాలను అందుకున్నాడు ఉదయ్.


మెగాస్టార్ కూతురితో నిశ్చితార్ధం వరకు వచ్చిన వివాహం ఆగిపోయింది. వ్యక్తిగతంగా జీవితంలో అది కోలుకోలేని గాయమని సన్నిహితులు చెబుతుంటారు.
2012లో ఉదయ్ విషితను వివాహం చేసుకున్నారు. అప్పటికే సినిమా కెరీర్ అంతంత మాత్రంగానే వున్న ఉదయ్ 2014 జనవరి 5 న ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏమైనా 1980 , జూన్ 26న పుట్టిన ఉదయ్ మన మధ్య లేడనే విషయం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు.


చిత్రం సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఉదయ్ చిత్రం చెప్పిన కథగా తన ప్రస్థానాన్ని ముగించారు.


ఉదయ్ చివరిసారిగా నటించిన చిత్రం చెప్పిన కథ సినిమా ఈ మధ్యే విడుదలయింది.

-తెలుగువన్

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.