English | Telugu
టాలీవుడ్ కి కొత్త సెన్సార్ అధికారి వచ్చారు
Updated : Dec 17, 2014
తెలుగు ఇండస్ట్రీ వర్గాలలో ప్రస్తుతం కొంతమంది చాలా సంతోషంగా వున్నారు. ఈ సంతోషానికి కారణం ఏంటో తెలుసా.. హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మి స్థానంలో కొత్త అధికారి రావడమే. ఎందుకంటే ఇంతకాలం ఈమె వలన చాలా మంది సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు చాలా ఇబ్బందులు పడ్డారు. అనవసరపు కటింగులు, సరైన విధంగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టేదంటూ వార్తలు వినిపించాయి. ఈమె ప్రవర్తనపై మంచు ఫ్యామిలీ, రాంగోపాల్ వర్మ వంటి వారు విమర్శలు కూడా చేశారు. అయితే ఇపుడు ఈమె స్థానంలో విజయ్ కుమార్ రెడ్డిని నియమించారు. విజయ్ కుమార్ గతంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ విభాగంలో అనేక కీలకమైన ఉన్నత పదవులు నిర్వర్తించారు.