English | Telugu
ఆహుతి ప్రసాద్ కు అనారోగ్యం
Updated : Dec 16, 2014
సాయికుమార్ తండ్రి మనవడి పెళ్లి మరుసటి రోజే చనిపోగా, రెండ్రోజుల వ్యవధిలో సంగీత దర్శకుడు చక్రి మృతి చెందారు. ఈ వార్తలను విని టాలీవుడ్ కోలుకోక ముందే ఆహుతి ప్రసాద్ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆహుతి ప్రసాద్‌కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన ఆహుతి ప్రసాద్‌ని బంధువులు, స్నేహితులు, సినీ రంగానికి చెందిన వారు పరామర్శిస్తున్నారు. టాలీవుడ్లో ఆహుతి ప్రసాద్ గొప్ప నటుడు. తన నటనా చాతుర్యంతో తను నటించిన ప్రతి సినిమాకు కీలంగా నిలిచేవారు. చందమామ సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకున్న ఆహుతి ప్రసాద్ బెండు అప్పారావు, గులాబి, నిన్నేపెళ్లాడుతా, కొత్త బంగారు లోకం వంటి సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేశారు.