English | Telugu

'ఐ' రిలీజ్ ఫిక్సయిపోయి౦ది

శంకర్ అద్భుతంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'ఐ'. దీపావళికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ లేట్ కావడంతో వాయిదా పడింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 9, 2015న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి ఫిక్సయిపోయినట్లు సమాచారం. ఈ చిత్ర సినిమాటో గ్రాఫర్ పిసి శ్రీరామ్ కొద్ది గంటల క్రితం ఈ మేరకు ట్వీట్ చేసారు. 9 జనవరి 2015 మనం ఐ సినిమా చూస్తాం అని ఆయన పేర్కొన్నారు. దీంతో 'ఐ' ఎప్పుడాని ఎదురుచూస్తున్న సినీ అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. తెలుగులో ఈసినిమాను ఆర్బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై అందిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల రూపాయలతో నిర్మితమౌతున్న ఈ సినిమాలో 'విక్రమ్' వివిధ గెటప్ లో కనిపించబోతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.