English | Telugu

‘ది రాజా సాబ్‌’ చిత్రంతో మారుతికి విమర్శలు తప్పవా.. అందరి ఒపీనియన్‌ ఇదే!

సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్‌ అయినా తన మొదటి సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టాడంటే.. అది ఏ జోనర్‌ సినిమా అయితే ఆ జోనర్‌ డైరెక్టర్‌గా ముద్ర పడిపోతుంది. అయితే ఆ సర్కిల్‌ నుంచి బయటికి వచ్చి రకరకాల జోనర్స్‌లో సినిమాలు చేసి సక్సెస్‌ అయినవాళ్ళు కూడా ఉన్నారు. కానీ, ఒక డైరెక్టర్‌ మాత్రం తనపై ఏర్పడిన ముద్రను తొలగించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. అతనే డైరెక్టర్‌ మారుతి. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్‌గా, కో ప్రొడ్యూసర్‌గా ఎన్నో సినిమాలకు పనిచేసిన మారుతి ‘ఈరోజుల్లో’ చిత్రంతో డైరెక్టర్‌గా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ కొట్టాడు. రూ.54 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.12 కోట్లు కలెక్ట్‌ చేసి చిన్న సినిమాల నిర్మాణానికి ఊతం ఇచ్చింది. ఆ తర్వాత మారుతి చేసిన ‘బస్‌స్టాప్‌’ కూడా సూపర్‌హిట్‌ అయింది. అయితే ఈ రెండూ యూత్‌ సినిమాలు. ప్రజెంట్‌ యువత ఎలా ఉన్నారు, వారి మాట తీరు, ప్రవర్తన ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు మారుతి. అదే అతనికి మైనస్‌గా మారింది. ఈ రెండు సినిమాలతో బోల్డ్‌ సినిమాలు తీసే దర్శకుడిగా అతనిపై ముద్ర పడిపోయింది.

ఆ ముద్ర నుంచి బయట పడేందుకు కొన్నాళుÊళ డైరెక్షన్‌ జోలికి వెళ్లలేదు. వేరే డైరెక్టర్లతో 5 సినిమాలు నిర్మించాడు. అందులో హారర్‌ కామెడీలో ఒక చరిత్ర సృష్టించిన ‘ప్రేమకథా చిత్రమ్‌’ కూడా ఉంది. డైరెక్టర్‌గా సినిమాటోగ్రాఫర్‌ జె.ప్రభాకరరెడ్డి పేరును వేశారు. వాస్తవానికి ఈ సినిమాని మారుతి డైరెక్ట్‌ చేశాడని ఎవరికైనా అర్థమవుతుంది. కొంత గ్యాప్‌ తీసుకున్న తర్వాత ‘కొత్తజంట’ చిత్రంతో మళ్ళీ దర్శకుడిగా తన పేరు వేసుకున్నాడు మారుతి. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్‌’, ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజూ పండగే’, ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి సినిమాలతో ఫ్యామిలీ డైరెక్టర్‌గా మారాడు. ఇప్పుడు ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్‌’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ముందు గోపీచంద్‌ హీరోగా చేసిన ‘పక్కా కమర్షియల్‌’ ఏవరేజ్‌ సినిమా అనిపించుకుంది.

వరస పాన్‌ ఇండియా సినిమాలతో హీరోగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన ప్రభాస్‌తో మారుతి సినిమా అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా తన ధోరణిలో ప్రభాస్‌ని ఒక ఫ్యామిలీ హీరోగా ప్రజెంట్‌ చేయబోతున్నాడని సినిమా గ్లింప్స్‌, స్టిల్స్‌ చూస్తే అర్థమవుతుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ‘ది రాజా సాబ్‌’ హారర్‌ రొమాంటిక్‌ కామెడీ అంటూ ఎనౌన్స్‌ చేశాడు మారుతి. ఇప్పుడు ప్రభాస్‌ ఉన్న రేంజ్‌కి ఈ తరహా సినిమా చేస్తే దాన్ని ఆడియన్స్‌ ఎంతవరకు యాక్సెప్ట్‌ చేస్తారనేది అందరి సందేహం. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ‘ప్రేమ కథా చిత్రమ్‌’ తరహాలోనే ‘ది రాజా సాబ్‌’ కూడా ఉండబోతోందనే హింట్‌ ఇచ్చాడు మారుతి. హారర్‌ రొమాంటిక్‌ కామెడీ సినిమాలకు కాలం చెల్లిందని ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల ఫలితాలను చూస్తే తెలుస్తుంది.

ప్రస్తుతం హై బడ్జెట్‌ మూవీలను, హై టెక్నికల్‌ వేల్యూస్‌ ఉంటూనే యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభాస్‌తో హారర్‌ కామెడీ సినిమా చెయ్యాలనుకోవడం సాహసోపేతమైన నిర్ణయమేనని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమా కాస్త అటూ ఇటూ అయితే మారుతి భారీ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈమధ్యకాలంలో రిలీజ్‌ అయిన ప్రభాస్‌ సినిమాలన్నీ హై బడ్జెట్‌ మూవీస్‌. రాబోయే సినిమాలు కూడా బడ్జెట్‌ విషయంలో రాజీ పడేవి కాదు. వీటి మధ్య ఇలాంటి కాన్సెప్ట్‌తో చేసిన సినిమా ఎంతవరకు వర్కవుట్‌ అవుతుందనేది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.