English | Telugu

వెయ్యి మందితో క్లైమాక్స్.. నందమూరి హీరో సంచలనం!

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). గతేడాది 'డెవిల్' అనే పీరియాడిక్ ఫిల్మ్ తో పలకరించిన ఆయన.. ప్రస్తుతం ఒక భారీ యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ 21వ సినిమాగా.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. ఇప్పడూ ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

'NKR 21' క్లైమాక్స్ కోసం ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేశారట. హైదరాబాద్ సమీపంలో ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నేతృత్వంలో వేసిన భారీ సెట్ లో ఏకంగా 30 రోజుల పాటు క్లైమాక్స్ ఎపిసోడ్ ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రామకృష్ణ అదిరిపోయే యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఈ ఎపిసోడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ లతో కలిపి దాదాపు 1000 మంది పాల్గొన్నారట. కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో అత్యంత భారీగా రూపొందించిన క్లైమాక్స్ ఇదే.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.